Naga Chaithanaya : తెలుగు పరిశ్రమలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ అక్కినేని నాగచైతన్య. సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. సమంత రుతు ప్రభు తో విడిపోయిన తర్వాత చైతు మళ్లీ ప్రేమలో పడ్డారని ‘ మేజర్ ‘ సినిమా హీరోయిన్ శోభిత ధూళిపాళ తో డేటింగ్ చేస్తున్నాడని సినీ పరిశ్రమలో అనేక రుమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే రూమర్స్ పై యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా స్పందించారు. నాగచైతన్య ‘ లాల్ సింగ్ చడ్డా’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అమీర్ ఖాన్, కరీనాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రంలో చైతు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ కామెడీ ఎంటర్టైన్ ఆగస్టు 11న ఆల్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. దీని భాగంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు చైతు.
ఓ ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ లో భాగంగా శోభిత ధూళిపాళ పేరు వినగానే మీకు గుర్తొచ్చేది ఏంటి అని అడగ్గా నాగచైతన్య నవ్వేశారు. ఆ తర్వాత ‘నేను జస్ట్ నవ్వుతాను ‘ అని బదులిచ్చారు. సింపుల్‌గా తనదైన స్టైల్ లో ఒక నవ్వు ఇచ్చి ఎప్పటిలాగే గాసిప్స్ ను నేను పట్టించుకోను అని సమాధానం ఇచ్చాడు అని అర్థమవుతుంది. వాస్తవానికి ఇటీవల ‘ థాంక్యూ ‘ మూవీ ప్రమోషన్స్ లో కూడా శోభిత డేటింగ్ విషయంపై చైతన్య స్పందించలేదు. కానీ అది నేషనల్ మీడియాలో వచ్చిన గాసిప్ కావడంతో అదే మీడియాలో పరోక్షంగా దీనిపై రియాక్ట్ అయ్యాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బాలీవుడ్ మీడియా మాత్రం చైతు డేటింగ్ విషయంను వదలడం లేదు. దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉందని దానికి తగ్గట్టుగానే చైతు ఆన్సర్ ఇచ్చాడని స్పష్టంగా తెలుస్తుంది.
Naga Chaithanaya : శోభితతో ఎఫైర్ విషయంపై ఎట్టకేలకు స్పందించిన నాగ చైతన్య

అదే ఇంటర్వ్యూలో హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే క్రేజీ అని సమాధానం ఇచ్చారు. అలాగే హీరోయిన్ రాశి కన్నా పేరు చెప్పగా మంచి ఫ్రెండ్ అని బదులిచ్చాడు. కత్రినా కైఫ్ తన సెలబ్రిటీ క్రష్ అని చైతు తెలిపారు. ఆమె అందంగా ఉంటుందని, ఆమె ఎక్కడ మొదలుపెట్టి ఇప్పుడు ఎక్కడ ఉందో తాను చూశానని అన్నారు. ఆమె ఎదిగిన విధానాన్ని గొప్పగా పేర్కొన్నారు. అలాగే తాను ఎక్కువగా అభిమానించే ఇద్దరు యాక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అని నాగచైతన్య చెప్పుకొచ్చారు. ‘ లాల్ సింగ్ చడ్డా ‘ సినిమా ఫలితాన్ని బట్టి భవిష్యత్తులో బాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేస్తానని అన్నారు. గతంలో ఓ హిందీ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేయడం గురించి మాట్లాడుతూ ఈరోజు నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుందని నేను భావిస్తున్నాను. మన తిరస్కరణాలు వైఫల్యాలు మనకు సహాయం చేయాలి. నా అన్ని వైఫల్యాలకు నేను చాలా కృతజ్ఞుడను అని చైతూ చెప్పారు.