Sravana Masam : శ్రావణ మాసం అంత ఎందుకు నాన్ వెజ్ తినకూడదంటే..?

Sravana Masam : తెలుగు ప్రజలు భక్తితో పాటు కొన్ని నియమాలను కూడా పెట్టుకుంటారు. ముఖ్యంగా మహిళలు శ్రావణమాసంలో చాలా పవిత్రంగా ఉంటారు. వ్రతాలు, ఉపవాసాలు ఈ మాసంలో నిష్ట గా పాటిస్తారు. శ్రావణమాసంలో భక్తులు శివుని ఎక్కువగా పూజిస్తారు. ఈ మాసంలో ప్రతి సోమవారం ఆలయాలలో భక్తులు శ్రద్ధతో శివునికి పూజలు చేస్తారు. అలాగే ఈ శ్రావణమాసం నుంచి అనేక పండుగలు మొదలవుతాయి. కృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, వంటి అనేక రకాల పండగలు ఈ మాసంలో వస్తాయి.

కాబట్టి ఈ మాసం అంతా భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఉపవాస, పూజలతో పాటు ఈ మాసం అంతా కొందరు భక్తులు మాంసాహారం ముట్టకుండా నిష్టగా ఉంటారు. కేవలం కూరగాయల తోటే తమ భోజనాన్ని ముగిస్తారు. అయితే శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినకూడదు దీని వెనక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం. వర్షాకాలంలో నాన్ వెజ్ కి దూరంగా ఉండడం మంచిదిని, ఎండ లేకపోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ బలహీనంగా తయారవుతుంది.

Sravana Masam : శ్రావణ మాసం అంత ఎందుకు నాన్ వెజ్ తినకూడదంటే..

Do you know why you should not eat meat during the month of Shravana
Do you know why you should not eat meat during the month of Shravana

అయితే ఈ మాసంలో ఉపవాసం ఉన్నవారు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిదని పూర్వం నుండి పెద్దలు చెబుతున్నారు. దీని ఫలితంగా శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకపోవడం మంచిది. రైనీ సీజన్లో చాపలు మరియు ఇతర జలచరాలు పునరుత్పత్తి చేసినప్పుడు ఇది జలజీవుల సంతాన ఉత్పత్తి కాలం. జలచరాలకి సంతాన ఉత్పత్తి ప్రదేశాలు లేని వర్షాకాలంలో ప్రజలు చాపలు, ఇతర సముద్రపు ఆహారం తినడం మంచిది కాదు.