Jaggery Tea : ఈ రోజుల్లో అందరూ పని వల్ల ఏర్పడ్డ టెన్షన్స్ ను తగ్గించుకోవడానికి టీ లు ఎక్కువగా తాగుతారు. ఇంటికి ఎవరైనా బంధువులు రాగానే చాయ్ ఇచ్చి మర్యాదలు చేస్తాం. బయటికి వెళ్లిన సమయంలో ఒక కప్పు టీ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. టీ ప్రియులు రోజుకి ఐదు ఆరు కప్పుల కంటే ఎక్కువగా చాయ్ తాగుతుంటారు. అయితే చాయ్ తాగినప్పుడల్లా దానిలోని చక్కెర మన శరీరంలోకి వెళ్లి ఎక్కువ క్యాలరీలు చేరేలా చేస్తుంది. దీనివల్ల బరువు పెరుగుతాం. చక్కెర తయారీకి వాడే వివిధ రసాయనాల వల్ల కూడా మనం వ్యాధులకి గురి అవుతున్నాన్ . అయితే చాయిలో చక్కెరకు బదులు బెల్లం చేర్చుకుంటే ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
అదేవిధంగా బెల్లం తో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లంలో 50 నుండి 60 శాతం సుక్రోజ్ ఉంటుంది. అలాగే 30 నుండి 40% నీరు ఉంటుంది. 100 గ్రాముల బెల్లంలో 358 క్యాలరీలు, 27 మిల్లీ గ్రాముల సోడియం, 53 మిల్లీగ్రాముల పొటాషియం,0.21% కాల్షియం, 32 శాతం ఐరన్, 90 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బెల్లంలో ఉండే యంటీ అలర్జిక్, శరీరంలో టెంపరేచర్ రిగ్యులేఇంగ్ లక్షణాలు ఆస్తమా నివారణకు బాగా ఉపయోగపడతాయి. పొటాషియం ,జింక్ సెలీనియం లు ఫ్రీ రాడికల్ డామేజ్ అడ్డుకొని బాడీకి ఇన్ఫెక్షన్ నుంచి తట్టుకునే కెపాసిటీని ఇస్తాయి.
Jaggery Tea : ఏది వాడితే ఆరోగ్యానికి మంచిది అంటే.

జీర్ణక్రియలో ఎంజైమ్ లు రిలీజ్ లో బెల్లం ముఖ్యపాత్ర వహించి రక్తహీనత, అజీర్తి సమస్యలు, మలబద్ధక సమస్యలను, అరికడుతుంది. అందుకే రోజు బెల్లంతో చేసిన టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం తినడం వల్ల స్త్రీలలో హ్యాపీ హార్మోన్లు రిలీజ్ఐ బహి ష్టు సమయంలో కడుపునొప్పిని తగ్గించేలా చేస్తుంది. మలబద్ధక సమస్యతో బాధపడేవారు రోజు ఒక కప్పు బెల్లం టీ తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. టీ లో బెల్లం తో పాటు రెండు ముక్కల అల్లాన్ని వేసి బాగా మరిగించి తాగడం వల్ల జీర్ణ సమస్యలకు బాయ్ బాయ్ చెప్పవచ్చు. దీంతో జీర్ణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.
బెల్లం బ్లడ్ ప్యూ రిఫయలా సహాయపడుతుంది. రక్తాన్ని క్లీన్ చేయడంతో పాటు శరీరంలోనే ప్రతి అవయవాలకు రక్త సరఫరా చేయడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని అధికం చేస్తుంది. టీ లో బెల్లం తో పాటు కొద్దిగా అల్లాన్ని కూడా ఆడ్ చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో జలుబు, దగ్గు ,అలర్జీలు తగ్గుముఖం పడతాయి. బెల్లం ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో తీసుకున్నారు అంటే మీరు అనారోగ్య సమస్యలకు గురి అవుతారు.