Srimukhi : శ్రీముఖిని చూసి ఆపుకోలేక స్టేజ్ మీదే ముద్దులు పెట్టేసిన ఆది, రాంప్రసాద్.. అందరూ షాక్.. వైరల్ వీడియో

Srimukhi : శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా తెలుగు బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది శ్రీముఖి. పటాస్ అనే షోతో బుల్లితెరకు పరిచయం అయింది. తన వాక్చాతుర్యం, కామెడీ టైమింగ్ తో తెలుగు బుల్లితెర మీద నెంబర్ వన్ యాంకర్ గా వెలుగొందుతోంది. ఏది ఏమైనా తనకు ఉన్న క్రేజే వేరు. ఫాలోయింగే వేరు. తనకు సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా మిలియన్ వ్యూస్ వస్తాయి. ఇక.. పలు రకాల షోలలో యాంకర్ గా చేస్తూ ఫుల్ బిజీ యాంకర్ అయిపోయింది శ్రీముఖి.

hyper aadi and auto ram prasad kiss to srimukhi in hello brother show
hyper aadi and auto ram prasad kiss to srimukhi in hello brother show

త్వరలో రక్షాబంధన్ రానున్న నేపథ్యంలో మల్లెమాల వాళ్లు హల్ బ్రదర్ అనే షోను ప్లాన్ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆ షో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ షోకు సంబంధించిన పలు ప్రోమోలను తాజాగా విడుదల చేశారు. ఆ ప్రోమోలో ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది పోటీ పడి మరీ శ్రీముఖికి ముద్దు పెడతారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Srimukhi : అసలు ఏం జరిగిందంటే?

హల్ బ్రదర్ ఈవెంట్ లో భాగంగా హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కు శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తుంది. ఆ టాస్క్ చేసే సమయంలో ఆకలేస్తే అన్నం పెడతా అనే పాటను ప్లే చేస్తారు. ఆ పాట రాగానే వెంటనే స్టేజి మీదికి పరిగెత్తిన రాం ప్రసాద్, ఆది ఇద్దరూ శ్రీముఖి చేతులు పట్టుకొని తెగ ముద్దులు పెట్టేస్తారు.

శ్రీముఖి వాళ్లను వదిలించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఆకలేస్తే అన్నం అన్నావు, అలసి వస్తే ఆయిల్ ఆన్నావు. ఆ తర్వాత మూడ్ వస్తే ముద్దులు పెడతా అన్నావు కదా.. పెట్టు అంటూ శ్రీముఖిని ఇబ్బంది పెడతారు ఆది, రాంప్రసాద్. ఇంతలో బావా అంటూ గట్టిగా అరుస్తుంది శ్రీముఖి. దీంతో ఆ షోకు గెస్ట్ గా వచ్చిన నవీన్ చంద్ర స్టేజ్ మీదికి వస్తాడు. దీంతో అతడికి ముద్దు పెడుతుంది కానీ.. ఆది, రాంప్రసాద్ కు ముద్దు పెట్టదు. దీంతో ఆది, రాంప్రసాద్ ఫీల్ అవుతారు. దానికి సంబంధించిన ప్రోమోను చూసి నెటిజన్లు కూడా తెగ నవ్వుకుంటున్నారు. పాట వచ్చినంత మాత్రాన అంతలా ఆవేశపడి ముద్దులు పెట్టేయాలా అంటూ ఆది, రాంప్రసాద్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎంత కరువులో ఉన్నారో పాపం అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.