Health Benefits Mustard : ఆవాలంటే తెలియని వారంటే ఉండరు. తెలుగువారు ఎంతో కాలం నుంచి ఆవాలను తమ వంట ఇంట్లో పోపు దినుసులు లో భాగంగా వినియోగిస్తున్నారు. పోపు వేయాలంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆవాలు. తెలుపు గోధుమ రంగు నలుపు వర్ణాల్లో ఆవాలు లభిస్తున్నాయి. మనం రోజు చేసుకునే కూరల్లో ఆవరణ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆవాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం. నిలువ పచ్చడిలోను,తగిన మోతాదుల్లో ఆవాలు ఉపయోగం అందరికీ తెలిసిందే. ఆవాలు జీర్ణ శక్తిని దోహదపడుతాయి. ఆకలిని పుట్టిస్తాయి. ఈ గింజల్లో మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యాల్షియం, పొటాషియం , మెగ్నీషియం,ఫాస్ఫరస్ వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో శరీరానికి పోషణ అందుతుంది. చల్లదనంతో కీళ్ల వంటి నొప్పులను తగ్గించడంలో ఆవాలు శక్తివంతంగా పనిచేస్తాయి .
వెంటనే నొప్పి వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఈ గింజల్లో ఉండే పోషకాలు అనేక వ్యాధులు రాకుండా కాపాడి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శ్వాసకోశ సమస్యలు ,కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆవాలను తీసుకుంటే గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఆ వారిలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఈ గింజల్లో ఉండే న్యూస్ అనే పదార్థం మోషన్ సులభంగా అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా శరీరం యొక్క మెటబాలిజాన్ని అధికం చేస్తుంది. ఆవాలలో ఉండే కాపర్ ,ఐరన్ ,మెగ్నీషియం హై బీపీ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఆస్తమా సమస్యతో బాధపడేవారు ఆ వలన తరచుగా తీసుకుంటే ఈ సమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది . వీటిలో విటమిన్ ఏ,సీ,కేలు అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. శరీర కణజలాలకు రక్షణ కల్పిస్తాయి. వివిధ రకాల చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
Health Benefits Mustard : ఆవాలతో అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్.

ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం శరీరంలో తయారయ్యే వివిధ క్యాన్సర్లను గుర్తించి వాటిని అంతం చేస్తుంది. ఆవాలు నూనె దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో విటమిన్ ఏ ఉండడం వల్ల జుట్టు దృఢంగా పొడవుగా పెరిగేలా దోహదపడుతుంది. ఆవాలలో ఉండే కెరోటిన్స్, లూటీన్, విటమిన్ ఎ, సి ,కె ఆంటీ ఏజెంట్ గా ఉపయోగపడతాయి. ఆవాల వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో దుష్ఫవాలు కూడా అనే ఉన్నాయి. వీటిలో ఉండే ఘటన ద్రవ్యాలు మనకు పైత్యాన్ని ఏర్పడుస్తాయి. అసిడిటీ ,చర్మ సమస్యలు ఉన్నవారు ఈ గింజలను పోపుల ద్వారా మాత్రమే తీసుకోవాలి. శరీరంలో అధికంగా వేడి ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవడం ఉత్తమం. ఆవపిండిని ఎక్కువగా తీసుకుంటే కడుపునొప్పి, విరోచనాలతో పాటు ఇన్ఫెక్షన్ల సమస్యలు మొదలవుతాయి. కాబట్టి వీటిని మితంగా తీసుకుంటేనే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.