Guppedantha Manasu 8 August Today Episode 523 : సాక్షి తో పెళ్లికి ఒప్పుకోని ఇంట్లో వాళ్లందరికీ షాక్ ఇచ్చిన రిషి , వసుధార పరిస్థితి ఏంటి ?

Guppedantha Manasu 8 August Today Episode 523 : గుప్పెడంత మనసు సీరియల్ 8-aug-2022(523) ఎపిసోడ్ ముందుగా మీ కోసం….. రెస్టారెంట్లో వసుధార రిషి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.రిషి గురించే ఆలోచిస్తూ వసుధార రెస్టారెంట్లో ఒకరి ఆర్డర్ మరొకరికి ఇస్తూ పొరపాట్లు చేస్తూ ఉంటుంది. ఇంతలో రిషి రెస్టారెంట్ బయటికి వచ్చి కారు ఆపుతాడు. ఒకసారి బయటికి వాస్తవా అని మెసేజ్ చేస్తాడు వసుధారకి. మేనేజర్ పర్మిషన్ తీసుకొని రిషితో కలిసి బయటకి వెళ్లిపోతుంది వసు ఒకచోట ఇద్దరూ ఆగుతారు.వసుధ రాను పెళ్లిపీటలమీంచి ఎందుకు చేశావ్ నీ చదువు కోసమే కదా అని అడుగుతాడు అవును సార్ అని చెపుతోంది. అది నాకు బాగా నచ్చింది వసుధార నువు బాగా చదువుకోవాలి నువ్వు వృత్తిలోకి రావాలి డీపీఎస్పీ కాలేజ్ వసుధార అంటే అందరూ నీ గురించి చెప్పుకోవాలి అది విని నా స్టూడెంట్ అని నేను గర్వపడాలి అని చెప్తాడు రిషి. గొప్పగా ఉండాలి అలా ఉండాలి అని ఏదేదో రిషి చెప్తూనే ఉంటాడు. వసుధారకి రిషి ఎందుకు చెపుతున్నాడో ఏం అర్థం కాదు.

ఏది ఏమైనా సరే నీ చదువు ముందుకు సాగాలి నీ లక్ష్యం మర్చిపోకూడదు. గొప్పగా బతకాలి అనే మంచిగా చెప్తాడు రిషి. ఏంటి సార్ ఇది చెప్పడానికే పిలిచారా అని అడుగుతుంది వసుధరా. అవును ఇదే చెప్పడానికి పిలిచాను అని చెబుతాడు. వసుదారకి ఏం అర్థం కాదు కాదు తర్వాత ఇద్దరూ కార్లో బయలుదేరిపోతారు.కారులో వెళుతుండగా వసుదార మనమెలా కార్లో వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా అని అంటాడు. అవును సార్ని అని చెప్తుంది వసుధరా. ఇలా కారులో వెళ్లడం ఎంత బాగుంటుందో కదా జ్ఞాపకాలు చాలా అందంగా ఉంటాయి కదా అని రిషి చాలా కుమిలి పొతు చెప్తూ ఉంటాడు.వసుదారకి అది ఏమీ అర్థంకాక ఆలోచిస్తూ ఉంటుంది. వసుదార మీరేదో చెప్పాలనుకుంటున్నారో కాని నాకర్థం కావట్లేదు సార్ అని వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది.ఇది ఏమైనా కొత్త మలుపుకి నాంది కాబోతుందా అని భయపడుతూ ఉంటుంది వసుదార.

Guppedantha Manasu 8 August Today Episode 523 : సాక్షి తో పెళ్లికి ఒప్పుకోని ఇంట్లో వాళ్లందరికీ షాక్ ఇచ్చిన రిషి , వసుధార పరిస్థితి ఏంటి ?

Guppedantha Manasu 8 August Today Episode 523
Guppedantha Manasu 8 August Today Episode 523

వసుదార దిగెచోటు రాగానే రిషి కారు ఆపి వసుధరా నువ్వు దిగి వెళ్లిపోయే గమ్యం వచ్చింది అని చెప్తాడు. ఇక ఆ తర్వాత రిషి వాళ్ళింట్లో అందరూ ఒకేచోట హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.ఏంటి రిషి ఏం మాట్లాడట్లేదు అని దేవయాని అంటే మన ఇంట్లో చాలా తక్కువ మాట్లాడే వాళ్ళు ఒకళ్ళ ధరణి ఒకరు రిషి అని మహేంద్ర చెప్తాడు.రిషి వెంటనే మీరందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీతో ఒక మాట చెప్పాలి అని అంటాడు. పెద్దమ్మ సాక్షి పేరెంట్స్ని వీలు చూసుకొని మన ఇంటికి రమ్మని చెప్పండి అని రిషి అనగానే ఇంట్లోవాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.సాక్షి వాళ్ల పేరెంట్స్ ఎందుకు అనే ఏం తెలియనట్టు దేవయాని అడుగుతుంది.లగ్నపత్రిక రాసుకోవడానికే రమ్మని చెప్పండి అని రిషి అనగానే ఇంట్లోవాళ్లందరం ఒక్కసారిగా షాకై ఆశ్చర్యపోయి నిలబడి చూస్తూ ఉంటారు రుషి వైపు.ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని గౌతమ్ అడుగుతాడు.ఏంటి ఏం అర్థం కావట్లేదా సాక్షిని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాను అని రిషి అంటాడు.

అది కాదురా అని గౌతమ్ అంటుంటే ఈ విషయం గురించే ఇంకెవరు నన్నేం అడగొద్దు అని రిషి అంటాడు.పెద్దమ్మా కార్యక్రమం తొందరగా అయ్యేటట్టు చూడండి అనే రిషి అంటాడు.ఈ విషయంలో మీరు ఎవరికైనా వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయా అనే రిషి అడుగుతాడు.నువు చేసేది తప్పా కాదా అనే కథనువు అడుకుతుంది అని గౌతమ్ అంటాడు నన్ను అడిగితే ఈ పెళ్లి వద్దని చెప్తానని అంటాడు గౌతమ్. మహీంద్ర కూడా నాకు నచ్చలేదు అని గట్టిగా కోపంగా అంటాడు కానీ, నిష్టాన్ని ఎవరు కాదనగలరు అని మహేంద్ర అంటాడు. అందరూ చెప్పిందానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను అని రిషి అంటాడు.ఇంట్లో అందరూ నా ఇష్టమె మీ ఇష్టం అన్నారు అది నాకు బాగా నచ్చింది. అందుకే నా మనసుకు నచ్చిన నిర్ణయాన్ని నేను చేసుకుంటున్నాను అని రిషి అంటాడు.పెద్దమ్మ సాక్షితో జరిగే పెల్లిలో ఎలాంటి మార్పులు లేవు అని రిషి చెప్పేశాడు.

పెళ్లి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా చేయమని చెప్పి రిషి వెళ్లిపోతాడు.ఆ తర్వాత వసుదార రిషికి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ పట్టుకొని రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సార్ మీరు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నా మనసులో మాట మీకు ఎప్పుడూ చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుదార.రోజురోజుకీ నా మనసు బరువెక్కిపోతుంది అనే వసుధార అనుకుంటూ ఉండగా ఇంతలో వసుధారకి జగతి మేడం ఫోన్ చేస్తుంది.వసు ఏంటి ఇది రిషి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఏంటీ అని అంటోంది జగతి.ఏం నిర్ణయం మేడం అని వసు వుంటుంది సాక్షి తో పెళ్లి అని జగతి చెప్పగానే ఒక్కసారిగా షాకయ్యి తన చేతిలో ఉన్న ఫోన్ కిందికి వదిలేసింది.వసు వసు అని జగతి పిలిచినా స్పృహలో ఉండకుండా రిషి సార్ ఏంటి ఇలా చేశారు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది.