Janaki Kalaganaledu 8 August Today Episode 361 : జానకి, రామ, జ్ఞానాంబలపై విషం నూరిపోస్తున్న మల్లిక… దీని గురించి ఆలోచిస్తున్న విష్ణు….

Janaki Kalaganaledu 8 August Today Episode 361 : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 8 సోమవారం ఎపిసోడ్ 361 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి చదువుకోవాలి అంటే జ్ఞానాంబ కొన్ని షరతులు కు ఒప్పుకోవాలి అని అంటుంది. అప్పుడు జానకి సరే అత్తయ్య గారు మీ షరతులకి నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు జ్ఞానంబా జానకిని దేవుడు ఫోటోల దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ ఐదు నెంబర్లు వేసి నువ్వు తప్పు చేసినప్పుడల్లా ఈ నెంబర్లును కొట్టేస్తాను. ఈ ఐదు తప్పులు కొట్టేయడం జరిగిన మరుక్షణమే నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు తలవంచాలి అని అంటుంది. అప్పుడు జానకి సరే అత్తయ్య గారు అని అంటుంది. కట్ చేస్తే రామ, జ్ఞానంబ పెట్టిన షరతులు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి జానకి వస్తుంది. అప్పుడు రామ గారు ఏమైంది అని అడుగుతుంది.

ఏంటండీ బాధగా ఉన్నారు అని. అమ్మ మీరు చదువుకోడానికి ఒప్పుకున్నందుకు సంతోషించాలో లేదా షరతులు పెట్టినందుకు బాధపడాలో అర్థం కావడం లేదండి. అని అంటాడు.  ఇంత చిన్న విషయానికి మీరు ఎందుకు కంగారుపడుతున్నారండి. అప్పుడు రామ ఇది చిన్న విషయం కాదండి మనిషి అన్న తర్వాత ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుందండి అలాంటి తప్పులు జరుగుతాయేమో మీ చదువుకి అడ్డం వస్తుందేమోనని నా భయం అని అంటాడు. అప్పుడు జానకి కష్టపడకుండా ఏదీ సాధించలేమండి. ఎంత కష్టపడితే అంత మంచి విజయాన్ని సాధిస్తామండి. నేను అలాంటి షరతులని ఎన్నైనా దాటి నా చదువు పూర్తి చేసి నేను ఐపీఎస్ అవుతానండి. మీరు ఇకనైనా హ్యాపీగా ఉండండి అని అంటుంది. అంతటితో ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. కట్ చేస్తే మల్లికా విష్ణు గొడవ పడుతూ ఉంటారు. ఏమైందే మల్లికా నీకు అని అడుగుతాడు విష్ణు. అప్పుడు మల్లికా జ్ఞానంబ రామ జానకి మీద విషం నీరు నూరి పోస్తుంది.

Janaki Kalaganaledu 8 August Today Episode 361 : జానకి, రామ, జ్ఞానాంబలపై విషం నూరిపోస్తున్న మల్లిక…

Janaki Kalaganaledu 8 August Today Episode 361
Janaki Kalaganaledu 8 August Today Episode 361

విష్ణుని మార్చాలని చూస్తుంది. మీ అమ్మకు పెద్ద కొడుకు అంటేనే ఇష్టం మీరంటే ఇష్టం లేదు. తను అందుకే జానకి ఐపీఎస్ చదవడానికి ఒప్పుకుంది అని అంటుంది. అదేంటి మల్లికా మా అమ్మ ఒకల్ని ఒకలాగా ఇంకొకరిని ఇంకొక లాగా చూడదు అందర్నీ సమానంగానే చూస్తుంది. అప్పుడు మల్లికా ఓరి పిచ్చి మొగుడా..  మీ అన్నయ్య దగ్గర కూడా స్వార్థం ఉంది. మా అన్న దగ్గర స్వార్ధమా అని అంటాడు విష్ణు. అవును జానకి ఐపిఎస్ఐ అయితే వాళ్లు సిటీ కెళ్ళి సంతోషంగా బ్రతకాలని చూస్తున్నారు అని అంటుంది. విష్ణు మల్లిక చెప్పిన విషయాలను ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే జానకి బుక్స్ కనిపించ పోయేసరికి జానకి కంగారు పడుతూ ఉంటుంది.

కానీ మల్లిక ఆ పుస్తకాలను తీసుకొని వెళ్లి జానకి అల్మారా లో ఉన్న పూజ సామాగ్రి అంత తీసి కింద పడేసి ఈ బుక్స్ ను అక్కడ పెడుతుంది. ఎలాగైనా జానకిని తిట్టించాలి అని ప్లాన్ వేస్తుంది. జానకి రామ పుస్తకాల కోసం వెతుకుతూ ఉంటారు కానీ మల్లిక పూజ సామాగ్రి అన్ని విసిరేసి ఆ ప్లేస్లో పుస్తకాలను పెట్టి వెళ్ళిపోతూ ఉండగా.. జ్ఞానంభ తన రూమ్ కి వెళ్తుంది. అప్పుడు ఆ పూజ సామాగ్రి అంత కింద పడి ఉండడం చూస్తుంది. ఇలా ఎలా జరిగింది అని అల్మర తెరిచి చూస్తుంది. అప్పుడు అక్కడ బుక్స్ ఉంటాయి. ఇదంతా చూస్తూ మల్లిక తెగ సంబరపడిపోతూ ఉంటుంది. జ్ఞానాంబ ఆ బుక్స్ పట్టుకొని వచ్చి జానకిని పిలుస్తుంది. అప్పుడు అక్కడికి అందరూ వస్తారు. జ్ఞానాంబ జానకిని ఈ పుస్తకాలు నీవేనా అని అడుగుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.