Intinti Gruhalakshmi 8 August Today Episode 705 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 08-August-2022(705 episode) ఎపిసోడ్ ముందుగా మీ కోసం. లాస్య, నందు ఇద్దరూ గొడవ పడుతూ ఉండగా, నందు అసలు నువ్వు ఆ పోటీ ఎందుకు పెట్టావ్ అని అనగానే, లాస్య నువ్వు గెలవాలని, మొహంలో సంతోషం చూడాలని అని అనగానే, నేను గెలవలేదు, సామ్రాట్ కావాలని ఓడిపోయాడు, తులసి సైగ చేయడంతో అని అంటాడు. ఇలా గెలవడం కంటే, ఓడిపోవడమే సంతోషం ఉండేది అని అనగానే, నిజంగా నాకు ఈ విషయం తెలియదు అని లాస్య అంటుంది.ఆవేశపడకు, మనం జాబ్‌ని కాపాడుకోవాలి అని అనగానే, వేరే జాబ్ చూసుకుందాం అనగానే, జాబ్ దొరకడం కష్టం అని చెప్పి, అక్కడ్నించి వెళ్ళిపోతుంది.తర్వాత సామ్రాట్, వాళ్ళ భాబాయ్ ఇద్దరూ కలిసి తులసి వాళ్ళ ఇంటికి వస్తారు.అప్పుడు సామ్రాట్, వాళ్ళ బాబాయ్ తో చెపితే వినవు కదా, నీ మొండితనం నీదే అని అంటూ ఉంటాడు, అప్పుడు ఏమైంది అనగానే, చేయాల్సినంత చేస్తావు, ఏమైందంటే గింజుకుంటావు, ఎకౌంట్లో వయస్సు కరిగిపోతుంది, ఇంకెప్పుడు మార్తావు అని అనగానే ,తులసి ఏమైంది మీ బాబాయ్ మీద అంతా విరుచుకుపడుతున్నారండి అని అడుగుతుంది.
అప్పుడు సామ్రాట్, వాళ్ళ బాబాయ్ తో నీకు చిలకకి చెప్పినట్టు చెప్పాను, నోరుజారి తులసి గారి మీద మాట జారావు, అడగకూడని ప్రశ్న అడిగావు, నీకు అవసరం లేని ప్రశ్నను అడిగి ఇబ్బంది పెట్టావు, ఇంటి ముందుకు రాగానే లోపలికి ఆప్యాయంగా తీసుకెళ్తుంది అని అన్నావు, ఇప్పుడేమైంది బయటే నిలబెట్టారు చూశావా అని, అలా బాబాయితో అంటూ ఉంటాడు, ఇన్ డైరెక్టుగా వల్ల బాబాయ్‌తో అంటూ ఉంటాడు.అప్పుడు తులసి సామ్రాట్‌తో, మీ బాబాయ్ ఏ తప్పు చేశాడని, పెద్దవాళ్లు ఎవ్వరైనా అలానే అడుగుతారు, నేనే మర్యాద లేకుండా అలా ప్రవర్తించాను, సారీ అని చెబుతుంది.ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.అయితే మా మీద కోపం లేదు కదా అని అనగానే, లేదు అని అంటుంది తులసి, అయితే మేము నమ్మాలంటే మీ వస్తువు ఒకటి మా ఇంట్లో మర్చిపోయారు, దాన్ని తీసుకోవాలి అని, వీణను తీసుకొనివస్తాడు సామ్రాట్, తులసి దగ్గరికి, తులసి తీసుకుంటుంది వీణని, అప్పుడు అంకిత ఒక గిఫ్ట్‌ని ఒకసారి అందుకోవడమే గ్రేట్, అలాంటిది మా ఆంటీ ఒకే గిఫ్ట్‌ని రెండుసార్లు, ఒకే వ్యక్తి నుంచి అందుకుంది అని అనగానే, సామ్రాట్ అదృష్టం మీ అంటీది మాత్రమే కాదు నాది కూడా అని అంటాడు.
Intinti Gruhalakshmi 8 August Today Episode 705 : నందుని హెచ్చరించిన లాస్య, తులసికి సారీ చెప్పిన సామ్రాట్

అర్జంట్ మీటింగ్ ఉంది అని చెప్పి, ప్రాజెక్టు డిజైన్ చేయడానికి మీరు కూడా ఇక్కడికి రండి అని చెప్పి, సామ్రాట్ వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.తులసి కోసం సామ్రాట్ వాళ్లు ఎదురుచూస్తూ ఉంటారు.ఇంతలో తులసి రాగానే, సామ్రాట్ నాకు టైం వేస్ట్ చేస్తే నచ్చదు, ఒకరిని వెయిట్ చేయించకూడదని, టైమ్ మేనేజ్మెంట్ ఉండాలి అని తులసితో అంటాడు.అప్పుడు నందు, లాస్య తులసిని లేటుగా వచ్చినందుకు వెటకారంగా మాట్లాడుతూ అంటూ ఉంటారు.అప్పుడు సామ్రాట్ వాళ్లతో, నేను బాస్‌ని, ఏదైనా అడగాలి అంటే నేను మాట్లాడాలి, తులసి గారికి హర్ట్ చేసేలా మాట్లాడే హక్కు మీకు లేదు అని అనగానే, లాస్య సారీ అని అంటుంది, అప్పుడు సారీ చెప్పాల్సిందే నాకు కాదు, తులసి గారికి అని అనగానే, లాస్య వాళ్లు సారీ చెబుతారు. ఆలస్యం ఎందుకయింది అమ్మా అని తులసిని, సామ్రాట్ బాబాయి అడగగానే, ఇంట్లో అత్తమామలు పేషెంట్స్, వాళ్ళకి నా వoట తప్ప వేరేది పడదు, అందుకే లేట్ అయింది అని అంటుంది, దాంతో సామ్రాట్, వాళ్ల బాబాయ్ ఇద్దరు మెచ్చుకుంటారు తులసిని, కొడుకు వదిలేసినా కూడా, మీరు చాలా గ్రేట్ బాధ్యత తీసుకున్నారు.
ఈ రోజుల్లో ఇలాంటి కోడలు ఎక్కడా దొరకదు అని ,ఏమంటారు నందు అని అనగానే, ఆ అవును సార్ అని అంటాడు, దాంతో లాస్య టాపిక్ మార్చి, సార్ మీ నెక్స్ట్ మీటింగ్‌కి ఆలస్యం అవుతుందేమో, స్టార్ట్ చేద్దామా అని అనగానే, అప్పుడు సామ్రాట్ తులసితో మీరన్నట్టే ప్లానింగ్ ఛేంజ్ చేసారు అని, ఎక్స్ ప్లెయిన్ చేస్తారు, అప్పుడు తులసి నచ్చింది అని అంటుంది.అప్పుడు సామ్రాట్ నందుతో రేపు నాతోపాటు వైజాగ్‌కి వస్తున్నారు కదా, ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కూల్ డిజైన్ చూడటానికి, వాళ్ళకి మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యడానికి అని అనగానే, రేపు ఇంటర్వ్యూస్ ఉన్నాయి సార్, నాకు రావడం కుదరదు అని అనగానే, సామ్రాట్ వల్ల బాబాయ్, తులసిని తీసుకెళ్ళు అని అనగానే, సామ్రాట్ కూడా అవును అంటాడు, అప్పుడు తులసి నాకేం తెలుసు సార్ అనగానే, నీకేం తెలియదు కాబట్టే, నేర్చుకోవడానికి రమ్మంటున్నాను, అని ఇద్దరు తులసీని రమ్మని అంటారు.తరువాత లాస్య, నందు ఇద్దరూ అక్కడ జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.