Jr NTR : ఎన్టీఆర్ సినిమా మ‌రీ ఇంత వెన‌క్కి వెళుతుంది.. కార‌ణం ఏంటి?

Jr NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల సినిమాలు చాలా స్లో అండ్ స్ట‌డీగా చేస్తున్నాడు. అర‌వింద స‌మేత త‌ర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకొని ఆర్ఆర్ఆర్ చేశాడు. ఈ సినిమా వ‌చ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్ప‌టివ‌ర‌కు కొత్త ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్ల‌లేదు. దీంతో అంద‌రిలో అనేక ర‌కాల అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఎన్టీఆర్ త్వ‌ర‌లో కొరటాల శివ డైరెక్షన్ లో త‌న30వ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఒక బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ గా ఇది రూపొందుతుంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఒక మాస్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ని ఇచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అభిమానులు వెయిటింగ్..

ఈపాటికే సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది. అసలు సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమాను విడుదల చేయాలి అని చాలా ఆలోచించారు కానీ పరిస్థితిలు అందుకు భిన్నంగా ఏర్పడుతున్నాయి.కొరటాల శివ ఈ సినిమా కథలో చాలా మార్పులు చేస్తున్నారట. అలాగే, ఈ సినిమా ఆలస్యానికి మరో కారణం కూడా ఉంది. ఎన్టీఆర్ భుజం నొప్పితో బాధపడుతూ డాక్టర్ల సలహా మేరకు రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. షూటింగ్ ఇంకొన్నాళ్లు వాయిదా ప‌డ‌డం ఖాయంగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం 8-9 కిలోల బరువు తగ్గనున్నాడు తారక్.

Jr NTR : ఎన్టీఆర్ సినిమా మ‌రీ ఇంత వెన‌క్కి వెళుతుంది.. కార‌ణం ఏంటి?

what is the reson for delay jr Ntr movie
what is the reson for delay jr Ntr movie

హీరోయిన్స్ విషయంలో మాత్రం ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అసలైతే మొదట ఆలియా భట్ ఫిక్స్ అయినట్లు ఒక టాక్ అయితే వచ్చింది. ఆలియా భట్ కూడా ఆ విషయంపై స్పందించింది కానీ ఆమెకు తర్వాత మ్యారేజ్ జరగడం వెంటనే ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఎన్టీఆర్ తో నటించడం లేదని ఒక క్లారిటీ వచ్చేసింది. కియరా అద్వానీ, పరిణితి చోప్రా ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు. సెకండ్ హీరోయిన్ కూడా అవసరం ఉంది. కృతి శెట్టి లాంటి హీరోయిన్స్ ను తీసుకోవాలని చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.