Sharwanand : ‘ శతమానం భవతి ‘ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు శర్వానంద్. అటువంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే తాజాగా శర్వానంద్ నటిస్తున్న 30వ చిత్రం ‘ ఒకే ఒక జీవితం ‘ఈ సినిమాని శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను తమిళ్లో నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తొలిసారి టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ‘ ఒకే ఒక జీవితం ‘ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, అమ్మ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ తెచ్చుకుంది.
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.విఎఫ్ ఎక్స్ సన్నివేశాలు అద్భుతంగా రావటానికి చిత్ర వర్గం కృషి చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ చిత్రం యూనిట్ లాంచ్ చేశారు. ‘ఒకే ఒక జీవితం ‘ సినిమాని సెప్టెంబర్ 9న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియోని వదిలారు. ఇందులో శర్వా గిటార్ ప్లే చేస్తుండగా, ఆది మీ అమ్మని చూడాలని ఉందా అనే వాయిస్ ఓవర్ వినిపిస్తుంది.ఇది శర్వానంద్ నిరాశలో ఉన్న సంగీతకారుడుగా చూపిస్తుంది.
Sharwanand : ఎట్టకేలకు వచ్చేనెల 9న… ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వానంద్…

దేని వలనో అతను తన పనిపై దృష్టి పెట్టలేకపోతున్నాడని తెలుస్తుంది. నాజర్ టైం మిషన్ కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తుండడం మనం చూడవచ్చు. విజువల్స్ లో శర్వానంద్ తన స్కూల్ డేస్ లో తన తల్లి ఫోటో దిగడం అమ్మ పాట బ్యాక్గ్రౌండ్ చేసి సన్నివేశానికి ఎమోషనల్ టచ్ ఇవ్వడం కనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తుంది. పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సినిమాలో డైలాగ్స్ రాశారు. ఈ సినిమాను తెలుగు తమిళ భాషలో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో కణం అనే పేరుతో రిలీజ్ కాబోతుంది.