Karthika Deepam 13 August 2022 Episode : బ్రతికే ఉన్న కార్తీక్, దీపలు… కార్తీక్, దీపల ఫోటోలపై దండ లను తీసింది ఎవరు..?

Karthika Deepam 13 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 1430 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… హిమా, ఫ్రేమ్ లు ఈ పెళ్లి నీ ఆపాలి అని ప్లాన్లు వేస్తూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ హిమ ని పెళ్లి చేసుకుందాం అని అడిగితే ఏమంటుందో అని మనసులో అనుకుంటాడు. మళ్లీ వద్దులే అని అనుకుంటాడు. అంతలో సౌందర్య అక్కడికి వచ్చి హిమ ని తొందరగా రా గుడికి వెళ్ళాలి అని తీసుకెళ్తుంది. కట్ చేస్తే సౌర్య చీర కట్టుకొని రెడీ అయి ఉంటుంది. అప్పుడు ఆనందరావు అక్కడికి వచ్చి అబ్బబ్బ ఎంత చక్కగా ఉన్నావు తల్లి అని సౌర్యాన్ని అంటాడు. అప్పుడు శౌర్య నువ్వు నన్ను పొగడడానికి వస్తావా తాతయ్య అని అంటుంది.

ఇది పొగడ్త కాదు తల్లి ఎంత చక్కగా ఉన్నావు తెలుసా.. మనిద్దరం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం పట్టు అని ఇద్దరు కలిసి దిగుతారు. నిన్ను చూస్తే ఇక ఎవరైనా ఆటో తోలే అమ్మాయి అని అనుకుంటారా అని అంటూ.. అవున్రా నీ ఆటో బయోగ్రఫీ నాకు ఒకసారి చెప్పు అని అంటాడు. సరే తాతయ్య చెప్తాను విను అని తన చిన్ననాటి గతం లో వారణాసి నీ కలుస్తుంది తనకి వారణాసి ఆటో నేర్పిస్తాడు. తర్వాత వారణాసి సౌర్య ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్లి దీప, కార్తికల కోసం వెతికాము. ఆ ఆటో అంటే నాకు చాలా ఇష్టం తాతయ్య.. ఎందుకంటే మా అమ్మ కూర్చున్నట్లు అనిపిస్తుంది అందుకే నేను దానిని వదలను అని ఆనంద్ రావు కి చెప్తుంది. అప్పుడు ఆనందరావు ఆ వారణాసిని పంపించింది నేనే సౌర్య అని అంటాడు. అప్పుడు సౌర్య కోపంగా అంటే చిన్నప్పటినుంచి నన్ను మోసం చేయడం మొదలు పెట్టారా అని అనగానే..

Karthika Deepam 13 August 2022 Episode : బ్రతికే ఉన్న కార్తీక్, దీపలు…

Karthika Deepam 13 August 2022 Episode
Karthika Deepam 13 August 2022 Episode

సౌందర్య వచ్చి సౌర్య చంప పగలగొడుతుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావే.. నేను నీకోసం రాలేదా, నిన్ను బ్రతిమిలాడలేదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ శౌర్య అని కోపంగా అంటుంది. అప్పుడు శౌర్య ఇప్పుడు కొట్టినట్టుగా చిన్నప్పుడు కూడా నన్ను కొట్టి తీసుకురావచ్చు కదా.. అప్పుడు నేను అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం కలెక్టర్ చదివి కలెక్టర్ అయ్యేదాన్ని కదా.. అని అంటుంది. అప్పుడు హిమ నేను కూడా అమ్మానాన్నలకి ఇచ్చిన మాట కోసమే ఎంతో తపన పడుతున్నాను శౌర్య అని అంటుంది. అప్పుడు సౌర్య చాల్లే నీ నటనలు అని అంటుండగా సౌందర్య ఇద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి మీరు ఇక పదండి గుడికి వెళ్దాం..

అని గుడికి వెళ్లే ముందు మీ అమ్మానాన్నలకి దగ్గర దండం పెట్టుకుని రండి అని చెప్తుంది. అప్పుడు వాళ్లు ఇద్దరు వచ్చి కార్తీక్ దీప లకు దండం పెట్టుకుంటూ ఉంటారు. అంతలో సౌందర్య ఆ ఫోటోల వైపు చూసి ఈ ఫోటోలపై దండలు ఎవరు తీసారండి అని ఆనంద్ రావు ని అడుగుతుంది. అప్పుడు ఆనందరావు నేను కూడా గమనించలేదు సౌందర్య అని అంటాడు. తర్వాత అందరూ గుడికి వెళ్లి పోతారు. కట్ చేస్తే ప్రేమ్ నిరుపములు ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ్ నిరూపముకి హిమ గురించి చెప్పాలి అని అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..