Viral Video : గుడ్డును చీల్చుకొని బయటికి వచ్చి పడగ విప్పిన బేబీ కోబ్రా.. ఆ తర్వాత ఏం చేసిందో చూడండి

Viral Video : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఏ వీడియో వైరల్ అయినా కూడా ఆ వీడియోలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అందుకే కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే.. ఏ వీడియో వైరల్ అవుతుందో ఏ వీడియో వైరల్ కాదో చెప్పడం మాత్రం చాలా కష్టం. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పాములు, జంతువుల వీడియోలు ఊరికే వైరల్ అవుతుంటాయి.

baby cobra comes from an egg video viral
baby cobra comes from an egg video viral

కోబ్రాలంటే ఎవరికైనా భయమే. అది చిన్న పాము అయినా పెద్ద పాము అయినా అందరూ భయపడుతూనే ఉంటారు. పాము ఇక్కడుందంటే చాలామంది పామును చూసి అక్కడి నుంచి పరిగెత్తుతారు. పాము అంటే అంత హడల్.

Viral Video : బేబీ కోబ్రా గుడ్డు నుంచి బయటికి వచ్చే వీడియో వైరల్

సాధారణంగా పాములు గుడ్లు పెడతాయని తెలుసు కదా. గుడ్ల నుంచే పాము పిల్లలు బయటికి వస్తుంటాయి. కోడి ఎలా గుడ్లు పెట్టి పొదుగుతుందో పాములు కూడా గుడ్లు పెట్టాక.. తమ కింద పెట్టుకొని వాటిని పొదుగుతాయి. గుడ్లు పొదగడం అయిపోయాక.. పాము పిల్లలే గుడ్లను పగులగొట్టుకొని బయటికి వస్తాయి.

తాజాగా నాగుపాము పెట్టిన గుడ్డులో నుంచి బేబీ నాగుపాము గుడ్డును పగులగొట్టుకొని మరీ బయటికి వస్తుంది. కానీ.. ఆ పాము పిల్ల బయటికి రాగానే బుస్సు మంటూ పడగ విప్పింది. వార్నీ చూస్తే వేలంత లేవు కానీ.. పుట్టడంతోనే బుసలు కొడుతున్నావు కదా అంటూ నెటిజన్లు ఆ వీడియోను చూసి కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి బేబీ కోబ్రా ఉన్న గుడ్డును ఓ యువతి చేతుల్లో పట్టుకోగా గుడ్డును పగులగొట్టుకొని మరీ ఆ కోబ్రా బయటికి వస్తుంది. చేతుల్లోనే అది బుసలు కొట్టడం చూసి ఆ యువతి కూడా షాక్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.