Viral Video : మోరీలో దూరిన పెద్ద కింగ్ కోబ్రా.. ఎంత పొడవుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఎలా పట్టుకున్నారంటే?

Viral Video : కింగ్ కోబ్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలుగా మన దగ్గర ఉండే నాగుపాములు వేరు.. ఈ కింగ్ కోబ్రాలు వేరు. మామూలు నాగుపాములు, తాచుపాముల కంటే కూడా కింగ్ కోబ్రాలు చాలా పొడవుగా ఉంటాయి. ఎక్కువ బరువుతో ఉంటాయి. ఇవి ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంటాయి. చూడటానికి భారీ ఆకారంలో ఉండే కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితం అయినవి. ఎక్కువగా వెదురు చెట్లు, చల్లదనం, నీళ్లు ఉన్న ప్రాంతాల్లో ఈ పాములు సంచరిస్తూ ఉంటాయి.

king cobra catching in keral video viral
king cobra catching in keral video viral

అయితే.. ఈ కింగ్ కోబ్రాను బెస్ట్ స్నేక్ క్యాచర్ వావా సురేశ్ అత్యంత జాగ్రత్తగా క్యాచ్ చేశాడు. మోరీలో పెద్ద పాము దాగి ఉందని తనకు స్థానికులు చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన వావా సురేశ్ దాన్ని పట్టుకునేందుకు చాలా కష్టపడ్డాడు. కేరళలోనే వావా సురేశ్ పేరు మోసిన స్నేక్ క్యాచర్.

Viral Video : భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్న సురేశ్ వీడియో వైరల్

కింగ్ కోబ్రా మోరీ కింద దాక్కొని ఉందని తెలుసుకున్న వావా సురేశ్ వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని పట్టుకునేందుకు తెగ ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసి స్థానికులు అందరూ అక్కడ గుమికూడారు. అప్పటికే రాత్రి కావడంతో పెద్ద పెద్ద లైట్లు పెట్టి మరీ ఆ పామును సురేశ్ పట్టుకున్నాడు. ఈ కింగ్ కోబ్రా కూడా చాలా పొడవు ఉంటుంది. దాదాపు 20 అడుగుల పొడవు, 10 కిలోల బరువు ఉన్న ఈ కింగ్ కోబ్రాను పట్టుకొని దాన్ని బంధించి అడవుల్లో వదిలేశాడు. కానీ.. కింగ్ కోబ్రాను పట్టుకోవడం కోసం వావా సురేశ్ పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఇది పాత వీడియోనే అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా కింగ్ కోబ్రాను వావా సురేశ్ ఎలా పట్టుకున్నాడో చూడండి.