Ileana : సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము. నిన్నటి మొన్నటి వరకు జీరో లా ఉన్నవారు హీరో కావచ్చు. అదేవిధంగా హీరోలా ఉన్నవారు జీరో కూడా కావచ్చు. అలాంటి పరిస్థితులును మరియు వ్యక్తులను మన ఇండస్ట్రీలో చాలామందిని చూడొచ్చు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఒక్క హిట్ కొడితే చాలు తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అదేవిధంగా వరుసగా ప్లాపులు అయితే అదేవిధంగా ట్రోల్స్ కూడా వెంటాడుతూనే ఉంటాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ విధంగా చూస్తే ఆ లిస్టులో ఇలియానా పేరు కూడా చెప్పుకోవచ్చు.
గోవా బ్యూటీ అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రామ్ పోతినేని తో చేసిన దేవదాసు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తరువాత మహేష్ బాబు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్లర్ తన ఖాతాలో వేసుకుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఆమె ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో అదే విధంగా కిందికి పడిపోయింది. తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే బాలీవుడ్ అంటూ అక్కడికి చెక్కేసింది. తరువాత ఒకటి రెండు సినిమాలలో నటించింది ఆ సినిమాలు ప్లాప్ అవడంతో అమ్మడు పరిస్థితి రివర్స్ అయ్యింది. తరువాత ఎంత ఫాస్ట్‌గా ఎదిగిందో అంత ఫాస్ట్ గా దిగజారిపోయింది అమ్మడి పరిస్థితి.
Ileana : మళ్లీ తెలుగు స్క్రీన్ పై కనిపించబోతున్న ఇలియానా….

అయితే రీసెంట్ గా టాలీవుడ్ లో సెకండ్ హీరోయిన్ గా ఇలియానాకు ఓ పెద్ద సినిమాలో అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది. త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న 28వ సినిమాలో ఇలియానా సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు సామాజిక మాధ్యమాలలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే గతంలో పోకిరి సినిమాలో ఇలియానా మరియు మహేష్ బాబు తో బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి జంట మరోసారి కలవడంతో మరో బ్లాక్ బస్టర్ పర్ఫామెన్స్ వీరి ఇరువురి నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్నారు. చూడాలి మరి మహేష్ బాబు సినిమాలో ఈ అమ్మడికి చోటి దక్కిందా లేదా అనే వార్తలలో నిజం ఎంతవరకు ఉందో.