Devotional : ఆవుతోక వెంట్రుకతో ఇలా చేయడం వల్ల జీవితంలో ఎటువంటి కష్టాలు తలెత్తవు.
మన తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఆవుని పవిత్రంగా భావిస్తారు. అయితే ఆవును పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఆవు మన ఇంటి ముందుకు వస్తే ఏదైనా పండుని, ధాన్యాన్ని పెడతారు. అంతేకాకుండా పసుపు కుంకుమలు వేసి పూజిస్తాము. ఆవు తోకలో నుండి ఒక వెంట్రుకను తీసుకొని కుడి చేతి బొటన వేలుపై చుట్టుకుని మనకు ఎక్కడైతే నొప్పిగా ఉంటుందో అక్కడే నొక్కి పట్టడం వల్ల నొప్పి నుండి కొంత ఉపశమనం కలుగుతుంది.
ఇలా ఒకటి రెండు రోజులు చేస్తే పూర్తిగా నొప్పి తగ్గుతుంది. మనం ఎవరైనా స్వాముల దగ్గరికి వెళ్ళినప్పుడు విసినకర్ర కర్రతో వెన్నుపైన పడతారు. ఆ విసిన కర్ర లో ఉండే తెల్లని వెంట్రుకలు మనం ఎప్పుడూ గమనించలేదు. అయితే ఆవు తోకలోని వెంట్రుకలు ఆ వెంట్రుకలు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ దూరమై ఆ ఇంట్లో ఆరోగ్యం ,ఆనందం ఉంటుందిఎవరికైనా దిష్టి తాకినప్పుడు ఈ వెంట్రుకలతో దిష్టి తీస్తే మంచి ఫలితం ఉంటుంది. పల్లెటూరులో రైతులకు ఆవు వ్యవసాయానికి బాగా సహాయపడుతుంది.
Devotional : ఆవుతోక వెంట్రుకతో ఇలా చేయడం వల్ల జీవితంలో ఎటువంటి కష్టాలు తలెత్తవు.

ఆవుకు ప్రత్యేకంగా పూజిస్తారు. ఆవుతోకలు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తారు. ఆవు పాదాల నుండి కొమ్ములు వరకు దేవాతి దేవతలు కొలువై ఉన్నట్లుగా భావిస్తారు. ఆవు పాలు లేదా ఆవు నెయ్యితో దేవుళ్లకు అభిషేకం చేస్తారు. గృహప్రవేశంలో ఆవుని శివపార్వతుకు పూజ సమర్పించినట్లుగా భావిస్తారు. ఆ ఇంట్లో ఆవు మలవిసర్జన చెయ్యడం వల్ల శుభప్రదంగా భావిస్తారు. ఆవులో శివపార్వతులు కొలువై ఉన్నట్లుగా భావిస్తారు. ఉగాది పండగ రోజు ఆవుని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు.