Goddess Lakshmi : ఇంట్లో ప్రశాంత జీవితం, ఆర్థిక సమస్యలు ఉండకూడదని ప్రతి ఒక్కరూ రోజు దేవుళ్లకు పూజ చేస్తారు. ఆర్థిక సమస్యలు తలెత్తకూడదని ప్రజలు ఎంతో కష్టపడుతుంటారు. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసిన ఫలితం ఏమాత్రం కనిపించదు. ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది నిరాశ చెందుతారు. కొన్ని సమయాలలో శారీరిక ,మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొన్ని సెంటిమెంట్లు ప్రకారం.. కష్టపడి పని చేయడంతో పాటు అదృష్టం కూడా అవసరమే. ఇంట్లో దేవాది దేవుళ్ళ ఆశీస్సులు ఉండటం కూడా ముఖ్యం. దేవతల ఆశీస్సులు కోసం ఎన్నో రకాల పూజలు చేయవలసి వస్తుంది. ఎటువంటి పూజలు చేస్తే ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.ఉదయాన్నే లేచి తలంటి లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని మంత్రాలను చదవాలి. మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి అమ్మవారిని నమస్కరించాలి. లేచిన వెంటనే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుభోదయం కంటే ముందే నిద్రలేచి ఈ పనులన్నీ చెయ్యాలి.
Goddess Lakshmi : లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే రోజు ఈ విధంగా చేయండి.

ఆ తరువాత స్థానం చేసి ఎర్రటి పూలను రాగి పాత్రలో ఉంచి సూర్య భగవాన్ కి నీటితో పాటు నమస్కరించాలి. ఓం సూర్యాయ నమం అని జపించాలి. సూర్య భగవాన్ తో పాటు తులసి మొక్క కూడా నీరు పోయాలి. తులసి అమ్మవారు దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తవు. తులసమ్మకు నీరు పోసే సమయంలో శ్రీహరి మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి దీపం , ధూపం చూపించి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి పది కాలాలు పాటు తిష్ట వేసి ఉంటుంది.