Devotional : దేవాలయాల్లో, పూజ చేసేటప్పుడు, పండుగల సందర్భాలలో కొబ్బరికాయలు కొడుతుంటాం. చాలాసార్లు కొబ్బరికాయలు మంచివి గానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు కొబ్బరికాయలు కుళ్ళిపోయి లేదా పండు బారినట్లుగా వస్తుంది. కానీ కొబ్బరికాయ కొట్టగానే కుళ్ళిపోయిందని చాలామంది నిరాశ చెందుతారు. నిజానికి పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే దోషమేమీ కాదని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే ఆ కాయని నీటితో శుభ్రపరిచి మంత్రోచ్ఛారణ చేసి మళ్లీ తిరిగి దేవునికి సమర్పిస్తారు.
అంటే ఆ దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కానీ కొట్టిన వ్యక్తి కాదు అని ఇందులోనే పరమార్ధం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయను తీసివేసి కాళ్లు, చేతులు, ముఖము, కడుక్కొని పూజ గదిని శుభ్రం చేసి మరల తిరిగి పూజ ప్రారంభించడం మంచిది. వాహనాలకు కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయినట్లయితే వాహనం మీద పడ్డ పోయినట్లే. అయినా సరే మళ్లీ వాహనం శుభ్రం చేసి మరో కొబ్బరికాయ కొట్టాలి.
Devotional : కొబ్బరికాయ కొట్టగానే పువ్వు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా…?

అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్ని కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తుంది. ఇలా పువ్వు కనపడిన కొందరు నిరాశ చెందుతారు. కానీ కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తే సుభ చూచికం అని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలియజేశారు. అలాగే భగవంతుని దగ్గర కొట్టిన కొబ్బరికాయని అందరికీ పంచి పెట్టాలి. కానీ దానిని వంటకాలలో ఉపయోగించరాదు. ఇలా పూజలో కొట్టిన కొబ్బరికాయని వంటల్లో ఉపయోగించినట్లయితే దోషం ఏర్పడుతుంది.