Incense Sticks : మనం చేసే ప్రతి పూజలు అగరవత్తులు వెలిగించడం అనేది సర్వసాధారణమైన విషయమే. పూజ ఎలా చేసినా అగరబత్తులను వెలిగించడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయట. పురాతన భారతీయ సంప్రదాయాల్లో అగరవత్తులు వెలిగించడం వల్ల దేవున్ని గది సువాసనతో నిండిపోతుంది. ఇటువంటి సువాసన గల అగరబత్తులని ఇంట్లో వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అని నమ్మకం.
మనం పూజలో ధూపం వేసే సాంబ్రాణిని బోస్వి లియా చెట్టు నుంచి లభించే జిగురు పదార్థంతో తయారు చేస్తారు. దీని నుంచి వచ్చే సువాసన బ్రెయిన్ లోని టీర్పీవీ3 అనే ప్రోటీన్ పై ప్రభావం చూపుతుంది. చర్మం కింద మృదుస్వర్శకు అవసరమయ్యే రావాలని ఈ ప్రోటీన్ రిలీజ్ చేసి ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. గుగ్గిలం అనే మొక్క నుంచి మండు వేసవిలో లభించే జిగురుని ద్వారా దీనిని తయారుచేస్తారు.
Incense Sticks : అగరబత్తులు ఎందుకు వెలిగిస్తారు తెలుసా
ఇది క్రిమిసంహారిగానే కాదు. రక్తస్రావాన్ని అరికట్టే గుణాలు కూడా కలిగి ఉంటుంది. వీటితో తయారుచేసిన అగరవత్తులును వెలిగించినప్పుడు గాలిలో కలుషితాన్ని శుభ్రపరుస్తుంది. అగరవత్తులు వెలిగించినప్పుడు వెలువడే సువాసన వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత కూడా అధికమవుతుంది. అందుకే పూజలో అగరవత్తులను తప్పనిసరిగా వెలిగిస్తారు.