Bad Dreams:మనకు నిద్రలో వచ్చే కలలు భవిష్యత్తును తెలియజేస్తాయని కొంతమంది నమ్ముతుంటారు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజంగా జరుగుతాయి అని నమ్ముతారు. అవి మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి అని కొందరు నమ్ముతున్నారు. మనం దేని గురించి ఆలోచిస్తామో దానికి సంబంధించినవే మనకు కలలుగా వస్తాయని కొంతమంది బలంగా నమ్ముతున్నారు. మరికొందరు కలలో వచ్చేది నిజజీవితంలో జరుగుతాయని అంటుంటారు. అయితే కలలో జరిగే కొన్ని సంఘటనలు మనకు చెడు జరిగే అవకాశం ఉందని తెలిపే సూచనలట. అంతేకాదు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంతోపాటు ఆరోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయని కొందరు నమ్ముతున్నారు.

కలలో ఇంటికి తాళం వేసినట్టు వస్తే అది మనకు మంచిది కాదు. ఇలా కలలు వస్తే ఆర్థిక పరంగా చెడు జరగబోతుంది అని అర్థం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఆంజనేయస్వామి ఆరాధించాలి. ఇలా చేస్తే కీడు జరగదని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు. కొంతమందికి కలలో అప్పుడప్పుడు జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అయితే కలలో జంతువులు కనిపిస్తే ఆరోగ్యం దెబ్బతీనే ప్రమాదం ఉందట. ఇలాంటి కలలు వచ్చినప్పుడు పేదవారికి ఆహారం లేదా బట్టలు దానం చేస్తే మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మనం ఇంటి నుంచి ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఎదురుగా పిల్లి అడ్డు వస్తే మంచిది కాదని అందరూ అంటుంటారు. అందులోనూ నల్ల పిల్లి అడ్డు రావడం వలన అశుభం జరుగుతుందని నమ్ముతుంటారు.
అయితే కలలో నల్ల పిల్లి కనిపిస్తే భవిష్యత్తులో కీడు జరగబోతుందని సూచనట. అలాంటి కలలు వస్తే శివుడిని పూజిస్తే అంత మంచే జరుగుతుంది. కలలో పసుపు వస్త్రాలపై మరకలు పడ్డట్టు వస్తే అది డబ్బు నష్టం జరుగుతుంది అనడానికి సూచన. ఇలాంటి కలలు వచ్చినప్పుడు లక్ష్మీదేవిని ఎర్ర వస్త్రాలు సమర్పించి పూజించాలి. ఎందుకంటే ఎర్రటి వస్త్రాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అలాగే కలలో ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి దూకడం లాంటిది వస్తే పెద్ద నష్టమే రాబోతుందని ముందస్తు సూచన అని అర్థం. వ్యాపార పరంగా ఆర్థికంగా నష్టాల పాలవడం వంటివి జరుగుతాయి ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఇష్టదైవాన్ని పూజించడం వలన అంతా మంచే జరుగుతుంది అని జ్యోతిష్యులు అంటున్నారు.