Diamond Ganesh : ఇటీవల గుజరాత్ లోని ఓ భక్తుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రవినాయకుని ఏర్పాటు చేశాడు. వినాయక చవితి సందర్భంగా సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి అత్యంత ఖరీదైన అరుదైన గణేశ విగ్రహాన్ని తన నివాసంలో ప్రతిష్టించాడు. అనుబాయ్ రామ్ జీబాయ్ అనే వజ్రాల వ్యాపారి వ్యాపార నిమిత్తం 15 సంవత్సరాల క్రితం బెల్జియం వెళ్ళాడు. ఇక అక్కడి నుండి అతను ముడి వజ్రాలను భారత్ కు తీసుకురావడం జరిగింది. ఇక దానిలోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్లుగా తన తండ్రి కి కల వచ్చిందట. దీంతో వెంటనే వెళ్లి వజ్రాలను పరిశీలించగా వినాయకుడి ఆకారంలో ఒక వజ్రం దర్శనం ఇచ్చింది.
దాంతో అప్పటినుంచి వారు ఈ వజ్ర గణపతిని పూజిస్తూ వస్తున్నారు. అయితే ఈ గణపతి విగ్రహం 182.3 క్యారెట్ డైమండ్ 36.5 గ్రాములు బరువు ఉంటుంది. ఇక మార్కెట్లో దీని ధర రూ.600 కోట్లుగా చెబుతున్నారు. దీంతో సూరత్ లోని ఈ గణేశ విగ్రహం ప్రపంచంలోనే ఖరీదైన విగ్రహంగా పేరుపొందింది. దీనిని లండన్ లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ధ్రువీకరించాయి. ఈ సందర్భంగా వ్యాపారవేత్త అనుభాయ్ మాట్లాడుతూ తమకి కరమ్ ఎక్స్పోర్ట్ డైమండ్ అనే కంపెనీ ఉందని ఇంట్లో ప్రతిష్టించిన ఈ వజ్ర వినాయకుడు వజ్రాల గనిలో కనిపించాడని చెప్పుకొచ్చాడు.
ఇది సహజంగానే ఏర్పడిందని దీనిని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నిర్ధారించాయని తెలియజేశారు. కోహినూరు వజ్రం కంటే కూడా ఇదే చాలా రెట్లు పెద్దదని అనుభయ్ రామోజీ బాయ్ అన్నారు. ఇక ఈ వజ్ర వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే..దానిలో కనిపించే గణేశుని ట్రంకు కుడివైపు తిరిగి ఉంటుంది. ఇలాంటిది మన విగ్రహాలలో ఎక్కడ కనిపించదు. గణేశుడు విగ్రహాలలో ఎక్కువగా ట్రంక్ ఎడమవైపు మాత్రమే తిరిగి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి సంవత్సరం ఈ వినాయకుడికి పూజలు చేసి నిమర్జనం కార్యక్రమంలో భాగంగా నది జలాలను తీసుకువచ్చి విగ్రహంపై చల్లుతారట. ఇలా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గణపయ్యగా సూరత్ గణనాథుడు పేరుగాంచారు.