Hibiscus Tree : చాలామంది ఇళ్లల్లో చాలా రకాల మొక్కలు షో కోసం పెంచుకుంటారు. ఇందులో కొన్ని పుష్పాలు మొక్కలు, మరి కొన్ని పండ్ల మొక్కలు, ఇక షో చెట్లను నాటుతారు. దీనిలో భాగంగా ఎర్రమందార చెట్లను పెంచుతారు. ఎరుపు రంగు పూలు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. చూడడానికి ఆకర్షనీయంగా ఉండడంతో అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. మనం చేసే ప్రతి పనిలో విజయం సొంతం చేసుకోవడానికి వినాయకున్ని పూజిస్తాము. వినాయకుడికి ఎరుపు రంగు ఎంతో ఇష్టం కాబట్టి ఎరుపు రంగు మందార పూలతో వినాయకుడిని కొలిస్తే, అన్ని పనులు అపజయాలు కలుగుకుండా పూర్తవుతాయి.
అలాగే ఎరుపు రంగు పూలు ఇచ్చే మందారం చెట్టు ఇంట్లో ఉంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మనం ఏదైనా విలువైన వస్తువుని పోగొట్టుకున్నట్లయితే ,దేవునికి ఎరుపు రంగు మందారంతో పూజ చేసినట్లయితే తిరిగి ఆ వస్తువు మన సొంతమవుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యభగవానికి ఎరుపు రంగు మందారాలతో పూజ చేయడం వల్ల ఎంతో ప్రసన్నుడు అవుతాడు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటకు పంపి, పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఎరుపు రంగు మందార పూలు కీలక పాత్ర వహిస్తాయి. ఇంట్లో తూర్పు దిక్కున ఎరుపు రంగు మందారం చెట్లు నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయట.
Hibiscus Tree : అయితే ఈ దోషాలన్నింటికీ..

జాతకంలో ఎవరికైనా సూర్యుడు బలహీన స్థానంలో ఉంటే మందారం చెట్టు ప్రభావం వల్ల… సూర్యుడు బలపడి అనుకూల ఫలితాలు వస్తాయట. అలాగే పిల్లల్లో చదువుపై ఆసక్తి చూపడానికి ఎరుపు రంగు మందారాలను పూజలో ఉంచి పూజ చేసినట్లయితే మంచి ఫలితం ఏర్పడుతుంది. అలాగే శివుడికి ఎరుపు రంగు మందారాలు అంటే ఎంతో ప్రీతికరం. సోమవారం రోజు ఎరుపు రంగు మందారాలతో శివునికి పూజ చేసినట్లయితే ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజున ఎరుపు రంగు మందారాలతో అభిషేకం చేసినట్లయితే ఇంట్లో ధన ప్రాప్తి కలుగుతుంది.