Kalagnanam Facts : 2024 బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే విధ్వంసాలు ఇవే..

Kalagnanam Facts : బ్రహ్మంగారు గొప్ప కాలజ్ఞాని. భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంధాలలో పొందుపరిచారు. ఇప్పటికే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం లోని విషయాలు చాలా వరకు జరిగినవి. ఈ క్రమంలోనే ఇప్పటికీ కూడా ప్రజలు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నమ్ముతున్నారు. కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకుతుందని చెప్పారు. గట్టిగా వర్షాలు పడి వరదలు బీటలు వారితో ఇంద్ర కీలాద్రిని కృష్ణానది తాకే అవకాశం ఉంది. అలాగే ఐదు సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని చెప్పారు.

Advertisement

these-are-the-destructions-that-will-happen-in-2024-brahmangari-calendar

Advertisement

చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఉంది. కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి కళ్ళు పోతాయని కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే శ్రీశైలం పర్వతానికి ఒక ముసలి వస్తుందని అది 8 రోజులు బ్రమరాంబ గుడిలో ఉండి మేకపోతుల అరిచి మాయమైపోతుందని తెలియజేశారు. కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని, వేప చెట్టు నుండి అమృతం కారుతుందని, శ్రీశైలానికి దక్షిణ కొండల నుండి రాళ్లు పడి ఆ పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని కూడా చెప్పారు. మనుషులు చేసే పాపాల ఫలితం కారణంగా ప్రకృతి వైపరీత్యాలు విపరీత చర్యలు చూపిస్తుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు.

పాపాలు ఎక్కువైనప్పుడు తాను మళ్ళీ పుడుతానని బ్రహ్మం గారు చెప్పారు. కాలజ్ఞానంలో ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకే కష్టం. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పగా బనగానపల్లి నివాసి శిష్యుడు తాళపత్ర గ్రంధాలలో రాశారని అనడానికి కాలజ్ఞానంలో సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం కలియుగ నడుస్తుంది ఇప్పటికే భూమి పై చాలా పాపాలు పెరిగాయి మనుషులు పక్షుల వాలిపోతున్నారు కొత్త కొత్త రోగాలతో సతమతమవుతున్నారు. బ్రహ్మంగారు ఆయన కాలజ్ఞానంలో రాసినట్లుగానే ప్రస్తుతం జరుగుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement