Dharmasandehalu : ఇంట్లో జెర్రీ కనిపిస్తే ఏమవుతుంది .. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే ..??

Dharmasandehalu : సాధారణంగా మన ఇంట్లో అప్పుడప్పుడు జెర్రీ పిల్లలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని శతపాదం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వీటికి కాళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శత పాదం అని పిలుస్తారు. ఇవి ఏ సీజన్లోనైనా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు చాలా విషపూరితమైనవి కూడా. ఇవి చీకటి మరియు తడిగా ఉన్న ప్రదేశాలలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. అందుకే ఇవి ఎక్కువగా ఇంట్లో వంటగదిలో కనిపిస్తూ ఉంటాయి. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం శుభ మరియు అశుభసంకేతాలకు శతపాదం ఎంతో ముఖ్యమైనది. శత పాదం ఇంట్లో కనిపిస్తే అది శుభం లేదా అశుభానికి సంకేతం అని అంటున్నారు. ఒక శతపాదం ఒక్క క్షణంలో ధనవంతులను లేదా పేదలను చేయగలదు. ఇవి కొన్ని సందేశాలను అందిస్తాయి. వాటిని బట్టి ధనవంతులు అవుతారా లేక పేదవారు అవుతారా అన్నది ఆధారపడి ఉంటుంది.

Advertisement

what-will-happen-if-jerry-is-seen-in-the-house-what-does-astrology-say

Advertisement

జెర్రీ అనుకోకుండా పాదాల కింద నలిగి చనిపోతే అది శుభ సూచకంగా పరిగణించబడుతుంది. అనుకోకుండా కాలి కింద నలిగి శతపాదం చనిపోతే ఏదో పెద్ద విపత్తు జరగబోయేది ఆగిపోయిందని అర్థం. విషపూరితమైన కీటకం కాబట్టి దానిని పాదాలతో చంపడానికి ప్రయత్నించవద్దు. శతపాదం రాహు గ్రహానికి సంబంధించింది. కాబట్టి శతపాదుడిని చంపడం రాహు గ్రహం యొక్క దోషానికి కారణం కావచ్చు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద చనిపోయిన శతపాదం కనిపిస్తే చాలా శుభ్రంగా పరిగణించబడుతుంది. అంటే ప్రధాన ద్వారంలో అప్పటికే చనిపోయిన శతపాదం ఉంటే ఎవరో ఆ ఇంటిపై చాలా చెడు దృష్టితో చూస్తున్నారని అర్థం.

రాహువు మీపై సంతోషంగా ఉన్నాడని అందుకే సంకేతం ఇవ్వడానికి ఇంటి ప్రధాన ద్వారం వద్ద చనిపోయిన శతపాదం కనిపించింది. అంటే ఒకరి చెడు ఇంటిపై పడినప్పుడు ఇంట్లో విషయాలు తప్పుగా జరగడం ప్రారంభమవుతాయి. ఎదురు వచ్చి జరగబోయే ప్రమాదం నుంచి కాపాడుకోమని సంకేతాలు ఇస్తుంది. అలాగే కారు ఇంటి నుంచి బయటికి తీస్తున్నప్పుడు శతపాదం కనిపిస్తే అది మంచి సంకేతం కాదు. బయటకు వెళ్లేటప్పుడు శతపాదం కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ప్రయాణాన్ని కొంతకాలం నిలిపివేయాలని సూచిస్తుందని అర్థం. లేదంటే నడుస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అందుకే ఎదురు వచ్చి జరగబోయే ప్రమాదం నుంచి కాపాడుకోమని శతపాదం సంకేతాలు ఇస్తుంది అని జ్యోతిష్యం చెబుతుంది.

Advertisement