Dharmasandehalu : పురాణాల ప్రకారం స్త్రీలు పొరపాటున కూడా ఈ రోజున గాజులు ధరించకూడదట. ఈ విషయాన్ని సాక్షాత్తు శివ పార్వతులు చెప్పినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఓ రోజు పార్వతీదేవి శివుడిని ఏ రోజున స్త్రీలు గాజులను ధరించడం వలన భర్త ఆయుష్షు తగ్గిపోతుందని అడుగుతుందట. అయితే దీనికి బదులుగా శివుడు ఇలా సమాధానం చెబుతాడు. వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించాలి. అయితే గాజులను ధరించే ముందు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గాజులను ఎప్పుడు ఉదయం లేదా సాయంత్రం సమయంలోనే ధరించాలి.
అలాగే గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే ధరించాలి. ఈ రోజున ధరించినట్లయితే భర్త ఆయుషు అనేది పెరుగుతుంది. ఇక మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, ధరించకూడదు. దాని వలన భర్త ఆయుష్షు తగ్గిపోతుంది అని శివుడు సమాధానం ఇస్తారు. అందుకే స్త్రీలు పొరపాటున కూడా మంగళవారం లేదా శనివారం గాజులను ధరించకూడదు. అలాగే ఉదయం లేదా సాయంత్రం మాత్రమే గాజులను ధరించాలి. ఎప్పుడు కొత్తగా గాజులు ధరించేవారు ఈ విషయాలపై ధ్యాస పెట్టాలి.
గాజులు ధరించడం వెనకా సైన్స్ కూడా దాగి ఉంది. పూర్వకాలంలో మగవాళ్ళు చాలా కష్టపడేవారు. ఆడవాళ్లు ఇంటికే పరిమితం అయి ఉండేవారు. ఇలా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే ఉండటం వలన మహిళలు రక్తపోటు సమస్యలతో బాధపడేవాళ్లు. మహిళలు అలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా వారు చేతులకు గాజులు వేసే సాంప్రదాయాన్ని పెట్టారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వలన రక్త ప్రసరణ నార్మల్ గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది. గాజుల వలన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే మన పూర్వీకులు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారట.