Masooda : కాంతార తరవాత మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ అయిన తెలుగు సినిమా ఇదే..!

Masooda : కన్నడ మూవీ కాంతారా తెలుగులో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు. ఒక కన్నడ సినిమా కేజీఎఫ్ తర్వాత తెలుగులో సూపర్ డూపర్ అవడం అనేది కాంతారాతోనే సాధ్యం అయింది. ఆ తర్వాత కాంతారా రేంజ్ లో సూపర్ సక్సెస్ అయిన తెలుగు మూవీ మసూద. నిజానికి ఇది చిన్న సినిమానే. కానీ.. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాలను తెరకెక్కించిన బ్యానర్ స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా విడుదలైంది.

after kantara masooda movie became super hit in telugu
after kantara masooda movie became super hit in telugu

సాయికిరణ్ దర్శకత్వం వహించగా, కావ్య కళ్యాణ్ రామ్, తిరువీర్, సంగీత, బాంధవి, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్ లాంటి వాళ్లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గత శుక్రవారం నవంబర్ 18 న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించడంతో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

Masooda : నిర్మాత దిల్ రాజు నిడివి తగ్గించమన్నా తగ్గించలేదన్న రాహుల్ యాదవ్ నక్కా

మసూద సినిమా నిడివిని తగ్గించాలని నిర్మాత దిల్ రాజు అడిగారు. కానీ.. సినిమాలో ఆత్మ మిస్ కావద్దని స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. ఇది కమర్షియల్ సినిమా కాదు. అందుకే.. సినిమా లెంత్ గురించి నేను ఆలోచించలేదు. నిజాయితీగా, ధైర్యంగా ముందుకెళ్లాను.. అని రాహుల్ నక్కా అన్నారు. చివరకు నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా నేను అమ్ముకోలేదు. నా వద్దే పెట్టుకున్నాను. ఓటీటీకి కూడా నేను ఇవ్వలేదు. అయితే.. దిల్ రాజు నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. అందుకే నేను దిల్ రాజుకు థాంక్స్ చెబుతున్నా అని రాహుల్ చెప్పుకొచ్చారు.