Venu Swamy : అక్కినేని అఖిల్ జాతకం బయటపెట్టిన వేణు స్వామి…అలా చేయకపోతే ఇక అంతే….

Venu Swamy  : తెలుగు సినీ పరిశ్రమలలో అక్కినేని ఫ్యామిలీకి ఎంతటి ఆధరణ ఉందో అందరికీ బాగానే తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు తో మొదలైన ఈ కుటుంబం మూడు తరాలు కూడా హీరోలుగా మారారు. ఇక నాగేశ్వరరావు తర్వాత నాగార్జున నాగార్జున తర్వాత అఖిల్ మరియు నాగచైతన్య హీరోలుగా తిరిగి సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టారు. కానీ హీరోలుగా అక్కినేని నాగేశ్వరరావు మరి నాగార్జున అందుకున్న క్రేజ్ మూడోతరం అఖిల్ మరియు నాగచైతన్య అందుకులేకపోయారు. అయితే దీనికి గల కారణం వారి జాతకంలో గల లోపం అంటూ జ్యోతిష్య శాస్త్ర నిపుణుల లో ఒకరైన వేణు స్వామి తెలియజేయడం జరిగింది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

akkineni-akhil-jataka-revealed-by-venu-swami-if-not-then-thats-it

Advertisement

ఎప్పుడూ సిని సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా వేణు స్వామి అక్కినేని అఖిల్ జాతకాన్ని బయటపెట్టాడు. అయితే నాగచైతన్య విడాకులు తీసుకుంటాడని వేణు స్వామి ముందే చెప్పినప్పటికీ దానిని ఎవరూ నమ్మలేదు. కానీ ఆ తర్వాత అదే జరగడంతో అప్పటినుండి వేణు స్వామి పై కాస్త నమ్మకం కూడా పెరిగిందని చెప్పాలి. ఇక ఇప్పుడు అఖిల్ విషయంలో కూడా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఖిల్ జాతకం ఏమాత్రం బాగోలేదని..అతని జాతకం ప్రకారం బాగుండాలంటే ఒక పని చేయాలంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే అఖిల్ ఎప్పుడైతే తల్లి మాటను వినకుండా ఉంటాడో అప్పుడు తన జీవితం బాగుంటుందంటూ చెప్పుకొచ్చాడు.

akkineni-akhil-jataka-revealed-by-venu-swami-if-not-then-thats-it

అయితే ఈ విషయంలో నాగార్జున కలగజేసుకుని అఖిల్ జీవితాన్ని సరిదిద్దాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక విషయాలను అఖిల్ విని ఉంటే బాగుండేదని తెలియజేశారు. అలాగే నాగచైతన్య మరియు అఖిల్ కు మధ్య కూడా వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి తెలియజేశారు. అలాగే ప్రస్తుతానికి నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితాన్ని కడుపుతూ సినిమాలపై దృష్టి పెట్టారు. ఇక అఖిల్ విషయానికొస్తే నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్లి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అక్కినేని వారసులకు జాతకంలో లోపాలు ఉండటం వలన ఇలా జరుగుతుందని వేణు స్వామి తెలియజేశారు. దీంతో ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement