Allu Arjun : అల్లు అర్జున్ ఇండస్ట్రీకి పరిచయం లేని పేరు. పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన అల్లు అర్జున్. పుష్ప మూవీ తర్వాత ఎంతో క్రేజ్ ను అందుకున్న హీరో బన్నీ. ఐ కాన్ స్టార్ గా ఒక రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. తను ప్రస్తుతం కమర్షియల్ యాడ్స్ తో బిజీగా మారాడు. కొన్ని కంపెనీలకు అంబాసిడర్ గా పెట్టుకోవాలని బన్నీ చుట్టూ తిరుగుతున్నాయి.
అయితే బన్నీ ఒక్క యాడికి 7.5 కోట్ల రూపాయలను అందుకునే అల్లు అర్జున్. ఇప్పుడు 10 కోట్ల రూపాయల ఒక ప్రకటనను తిరస్కరించారట.ఆ ప్రకటన ఏమిటనగా… మద్యం, గుట్కా లకు సంబంధించిన బ్రాండ్ ప్రకటన కోసం పది కోట్లు ఇవ్వడానికి రెడీ అవ్వగా… అల్లు అర్జున్ సున్నితంగా నో అని చెప్పారట. ఈ వార్తతో తన అభిమానులు సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్ తర్వాత సినిమా పుష్ప ది రూల్ కోసం రెడీ అవుతున్నారు.
Allu Arjun : ఆ బ్రాండ్ అత్యధిక ఆఫర్ కి నో చెప్పిన అల్లు అర్జున్…

ఈ రెండవ భాగం పై అభిమానులలో భారీగా అంచనాలను వేసుకుంటున్నారు. ఒకటవ భాగం బ్లాక్ బాస్టర్ అవ్వగా.. ఈ రెండవ భాగం దానికి మించి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం చేస్తుండగా హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ మూవీకి సంగీతం డీఎస్పీ అందిస్తున్నారు. ఈ మూవీ తొందర్లో సెట్ మీదికి రానుంది