Allu Arjun : జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే…

Allu Arjun  : తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక కలలాగా మిగిలిపోయిన ఉత్తమ జాతీయ నటుడు అవార్డుని ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము చేతుల మీదుగా తీసుకున్నారు. రాజధాని ఢిల్లీలో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించగా పుష్ప సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ అవార్డును దక్కించుకున్నారు. అయితే ఈ అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించేందుకు అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం అక్కడికిి చేరుకున్నారు. అయితే ఇదే ప్రోగ్రాం కి తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది వెళ్లారు. అలాగే చాలామంది జాతీయ అవార్డ్స్ ను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది.

Advertisement

Allu Arjun said on winning the National Film Awards – thanks to the  audience!: - Hindustan News Hub

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎక్కువ అవార్డులు రావడంతో రాజమౌళి ఈవెంట్స్ లో పాల్గొని సందడి చేశారు. అయితే బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ అని పేరు పిలవగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా చప్పట్లతో అరుపులతో రక్ష రచ్చ చేశారు. అయితే ఇది ఎవరు ఊహించలేదు. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ చూసి రాజమౌళి సైతం షాక్ అయ్యారు. ఈ క్రమంలో రాజమౌళి బన్నీ ముఖాన్ని చూస్తూ అలా ఉండిపోయారు.ఈ క్రమంలో అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అదే జరిగితే ఇండస్ట్రీలో మరో పారి బ్లాక్ బస్టర్ నమోదు అవ్వడం ఖాయం.

మరి రాజమౌళి బన్నీ కోసం ఏదైనా సినిమా తీస్తారా లేదా అనేది వేచి చూడాలి. అయితే బన్నీ అవార్డు తీసుకునేటప్పుడు బాలీవుడ్ నటీనటులు కూడా వీడియో చేయకుండా ఉండలేకపోయారు. అల్లు అర్జున్ పేరు చెప్పగానే అందరూ తమ ఫోన్ లో వీడియో తీయడం మొదలుపెట్టారు.చివరికి బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ కూడా అల్లు అర్జున్ అవార్డు అందుకుంటున్న సమయంలో ఫోటోను తీశాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన తెలుగు ప్రేక్షకులు చాలా ఆనందిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.

Advertisement