Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్స్ కి అందరు ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఈ సినిమాలో డైలాగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాతో ఒక్కసారిగా అల్లు అర్జున్ స్టార్ డం గా మారిపోయాడు. అయితే అంతా బాగానే ఉన్నా అల్లు అర్జున్ స్టార్డం గా మారడం వలన అల్లు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం. అల్లు అర్జున్, అల్లు శిరీష్ మధ్య విభేదాలు వస్తున్నట్లు, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లుగా వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు. అందులో అల్లు బాబీ ప్రొడ్యూసర్ గా సెటిల్ అయ్యాడు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ హీరోలుగా మారారు. 2019లో ఏబిసిడి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అల్లు శిరీష్ తను ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. దాంతో రాకేష్ శశి డైరెక్షన్లో ‘ ప్రేమ కాదట ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ నటిస్తుంది. అయితే సినిమా గురించి ఎటువంటి అప్డేట్ ఇంకా లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు శిరీష్ ఇంట్లో గొడవపడి ముంబైకి వెళ్లినట్లు తెలుస్తుంది.
Allu Arjun : దీనికి కారణం ఆమెనట…

అల్లు అరవింద్ బన్నీపై ఫోకస్ పెట్టినంతగా తనపై పెట్టట్లేదు అనే బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని సమాచారం. తన అన్న ఎదుగుదలకు ఎంతో కష్టపడితే తనకు గుర్తింపు లేదని ఆ బాధతోనే ఇంటి నుంచి ముంబైకి వెళ్లిపోయాడని సమాచారం. ఇందులో నిజం ఎంతుందో తెలియదు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తో ప్రేమ పెళ్లి విషయంలో గొడవలే ఇంటి నుంచి ముంబై వెళ్లిపోయాడని మరో టాక్ నడుస్తుంది. ఇందులో నిజం ఎంతుందో క్లారిటీ లేదు.