Anjali : అంజలి తెలుగు తమిళ్ సినిమాలలో తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను అంజలి తనవైపు తిప్పుకుంది. హీరో నితిన్ లేటెస్ట్ గా చేసిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ త్రెసా కథానాయకుడుగా నటిస్తున్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటూ ఉంది. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిఖితారెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం
చిత్రం చిత్రం మొదటి నుంచి ఆడియన్స్ లో అంచనాలు పెంచింది. ఇది సినిమాకు సంబంధించిన పోస్టర్లు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు సినిమా యూనిట్ వారు ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఈ సినిమాకి సంబంధించిన తాజా సమాచారం సినిమా యూనిటీ వారు మీడియాకు తెలియజేయడం జరిగింది. సినిమాలో అంజలి ఒక ఐటెం సాంగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Anjali : నితిన్ సినిమాలో అంజలి స్పెషల్ సాంగ్, పోస్టర్ తో కాక పుట్టిస్తున్న అంజలి.
దీనికి సంబంధించిన ఓ పోస్టర్ సినిమా యూనిట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్లో అంజలి ఘాటైన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళ మనసు దోచుకుంటుంది. ఈ సాంగ్ కు సంబంధించిన మరో అప్డేట్ ను మళ్ళీ ప్రకటిస్తారు అని శివ యూనిట్ వారు తెలియజేయడం జరిగింది. అంజలి సరైనోడు సినిమాలో అల్లు అర్జున్తో స్పెషల్ సాంగ్ చేయడం జరిగింది నితిన్ తో స్పెషల్ చేయడం తో అంజలికి తెలుగులో రెండో ఐటమ్ సాంగ్ అవుతుంది.