Ashu Reddy : బిగ్ బాస్ షో ద్వారా రాహుల్ సిప్లిగంజ్, అషు రెడ్డి మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. బిగ్ బాస్ షో వల్ల వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత తరచూ కలుసుకోవడం, పార్టీలు చేసుకోవడం వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అషు రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడంతో, లవ్ సింబల్ పెట్టడంతో డౌట్లు పెంచేశారు. అషు రెడ్డి గ్రాడ్యుయేషన్ కోసం యూఎస్ వెళ్ళింది. అది పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా చేసింది. ఆ తర్వాత ఒకరితో ప్రేమలో పడింది కానీ కొద్ది రోజుల్లోనే అది బ్రేకప్ అయిపోవడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. మరోవైపు రాహుల్ బిగ్ బాస్ షో లో ఉన్నప్పుడు పునర్నవి తో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో వీళ్లిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటారేమో అని టాక్ వచ్చింది.
అషు రెడ్డికి బిగ్ బాస్ తర్వాత ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ కు కూడా వెళ్తోంది. ఇలా కొద్దిరోజుల క్రితం బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో డిన్నర్ డేట్ కు వెళ్ళింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వదిలాడు రాహుల్. మేమిద్దరం రియల్ రిలేషన్షిప్ లో ఉన్నామని ప్రకటించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. రాహుల్ చేసిన ప్రకటనపై వెంటనే అషు రెడ్డి స్పందించింది. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అతడితో దిగిన ఫోటోను షేర్ చేసి ‘ సమయం వస్తుంది, నిజాలన్నీ అప్పుడే తెలుస్తాయి ‘ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీనికి సమయం ఎప్పుడు వస్తుంది బేబీ అంటూ రాహుల్ రిప్లై ఇచ్చాడు.
Ashu Reddy : రాహుల్ తో రిలేషన్ పై అషు రెడ్డి క్లారిటీ… అతని మీద కూర్చొని, ఆ సింబల్ పెట్టి మరి…

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ముగిసిన తర్వాత పర్సనల్ టూర్లతో హల్చల్ చేస్తుంది అషు రెడ్డి. అలాగే కొన్ని ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టుకుంటూ ముందుకు సాగుతుంది. అదే సమయంలో రాహుల్ కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా సత్తా చాటుతున్నారు. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అటు రాహుల్, ఇటు అషు రెడ్డి ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వీళ్ళిద్దరూ నిత్యం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వీళ్ళిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలో ఫోటోను షేర్ చేశారు. ఇందులో రాహుల్ ఒడిలో అషు రెడ్డి కూర్చుని కనిపించింది. తాము రిలేషన్ లో ఉన్నామని ప్రకటించుకున్న తర్వాత రాహుల్,అషు రెడ్డి జంటగానే హల్చల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.