Unstoppable Season2 : బాలయ్య బాబు తొలిసారి హోస్ట్ చేసిన కార్యక్రమం అన్ స్టాపబుల్ టాక్ షో. ఈ షో ఎంతగా క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటిగా అన్ స్టాపబుల్ షోపై అంచనాలు పెద్దగా క్రియేట్ అవ్వలేదు. కానీ బాలకృష్ణ విజన్ కు తరువాత ప్రతి ఎపిసోడ్ కు అంతకంతకు ఆదరణ పెరిగింది. మొదటి సీజన్ చూసిన తర్వాత మళ్లీ రెండవ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే సెకండ్ సీజన్ కు సంబంధించిన ప్రణాళిక పూర్తయినట్లుగా తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే టాక్ షోకు సంబంధించిన షూట్ కూడా స్టార్ట్ కాబోతోంది.
సెకండ్ సీజన్ కు సంబంధించిన పనులను గత నెలలోనే ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. బాలయ్య ఈసారి బిగ్ స్టార్స్ ను ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు సమాచారం. అందులో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లాంటి పెద్ద హీరోలను ఇంటర్వ్యూ చేస్తున్నట్లు సమాచారం. అలాగే మరికొందరు యువ హీరోలు, సీనియర్ దర్శకులు, టెక్నీషియన్స్ కూడా ఉంటారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ టాక్ షో తో బాలయ్య బాబుకు ఇంకా క్రేజ్ పెరుగుతుంది. బాలయ్య లో ఉన్న మరో మంచి కోణం, సరదా గుణం ప్రేక్షకులకు ఆయన దగ్గర అయ్యారు.
Unstoppable Season2 : బాలకృష్ణ ‘ అన్ స్టాపబుల్ టాక్ షో ‘ సీజన్ 2… ఎప్పుడో తెలుసా…?

అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనే విషయంలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అన్ స్టాపబుల్ టాక్ షో ఆగస్టు మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందట. మొదటి గెస్ట్ పై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దానికి సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేయాలని డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. బాలకృష్ణ ఈ కార్యక్రమం చేస్తూ మరోవైపు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా విజయదశమికి లేదా ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.