Deepika Pilli : టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన బుల్లితెర బ్యూటీ దీపికా పిల్లి. ఈ అమ్మడు టిక్ టాక్ ద్వారా తెగ వీడియోలు చేసి మన డాన్స్ తో మరియు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి తద్వారా బుల్లి తెరపై అవకాశం సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై దీపికా పిల్లి తన అందాల ఆరబోతుతో మరియు డాన్స్ తో ప్రోగ్రామ్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. బుల్లితెరపై ఢీ షోలో ఈమె చేసిన అల్లరితో ప్రేక్షకులు మరింతగా దగ్గరయ్యారు. అంతేకాకుండా ఆదితో ఈమె కౌంటర్ల తో ప్రేక్షకులకు మరింతగా నచ్చింది.
దీపికా పిల్లి ప్రస్తుతం స్టార్ మా లో కామెడీ షార్ట్స్ లో యాంకర్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. మొదటగా ఈ ప్రోగ్రాంలో వర్షిణి చేయగా ఆమె ఆ షోని వదిలి వెళ్ళగా దీపికా పిల్లి కి అవకాశం లభించింది. తాజాగా ఈ భామ ఇప్పుడు సుదీర్ తో ఒక సినిమాలో యాక్ట్ చేస్తుంది. ఈ మూవీలో ఈమె హీరోయిన్ గా చేస్తుండగా ఇంకో హీరోయిన్ గా విష్ణు ప్రియ చేస్తుంది. వాంటెడ్ పండుగాడు మూవీలో వీరిద్దరూ చేస్తుండడంతో ఈ మూవీకోసం అభిమానులు చాలామంది ఎదురుచూస్తున్నారు.
Deepika Pilli : దీపికా పిల్లి రెచ్చిపోతూ డాన్స్ ఇరగదీసింది

దీపికా పిల్లి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాను చేసే వీడియోస్ మరియు ఫోటోషూట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రదర్శిస్తూ తన ఫ్యాన్స్ కి ఎప్పుడు చేరువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తన ఎన్నిస్టాగ్రామ్ లో వీడియో షూట్ చేసి షేర్ చేసింది. తాను చేసిన వీడియోకు క్షణాల్లో వైరల్ గా మారి తన అందం తన డాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తన డ్యాష్ తో అందాల ఆరబోతతో సోషల్ మీడియాని షేక్ చేస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram