Rajamouli : ఏ సినిమాకు అయినా ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. ఎమోషన్ కరెక్ట్ గా ఉంటే ప్రేక్షకుడి కి నచ్చితే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఎమోషన్ ని ప్రేక్షకుడు ఫీలైనప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది లేదంటే ప్లాప్ అవుతుంది. అయితే ఎమోషన్ ని పట్టుకోవడంలో రాజమౌళి మాస్టర్. ఇది మగధీరతో కొంతవరకు తెలిస్తే బాహుబలి సినిమాతో యావత్ సినీ ప్రపంచానికి మరింతగా తెలిసింది. ఇక ఆర్ఆర్ఆర్ లో అల్లూరి భీమ్ పాత్రలని తీర్చిదిద్దిన తీరు ఆ పాత్రలకు బలమైన విషయాన్ని జోడించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
Rajamouli : ఈ విషయంలో రాజమౌళిని మించిన వారు లేరు…
తాజాగా ఇలాంటి చర్చ ఇప్పుడు బాలీవుడ్ సినిమా బ్రహ్మస్త్ర విషయంలో వినిపిస్తోంది. ఈ సినిమాలో రన్బీర్ కపూర్, అమితాబచ్చన్, నాగార్జున, అలియా భట్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 9న శుక్రవారం భారీ స్థాయిలో విడుదలయింది. మన పురాణాలు ఇతిహాసాల నేపథ్యంలో సకల హస్తాల దేవతల బ్రహ్మస్త్రం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఈ కథకు ఎమోషన్ ప్రధానం. అయితే అది ఈ కథలో కనిపించలేదు. భారీ స్టార్ కాస్ట్, హాలీవుడ్ ని తలపించే గ్రాఫిక్స్ ఉన్న కావాల్సిన ఎమోషన్ లేకపోవడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఇదే సినిమాని రాజమౌళి చేసి ఉంటే కథ వేరేలా ఉండేదని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎమోషన్ ని పండించి కథని రసవత్తరంగా నడపడం ప్రేక్షకుడిని ఎమోషన్తో కట్టిపడేలా చేయడం లో రాజమౌళి మాస్టర్. ఈ సినిమాను రాజమౌళి డీల్ చేసి ఉంటే అనుకున్న ఎమోషన్ కచ్చితంగా వచ్చి ఉండేది. దీంతో బ్రహ్మాస్త్ర సినిమా వేరేలా ఉండేదని చెబుతున్నారు. వెండితెరపై ఎమోషన్ ని పండించడం కేవలం జక్కన్న కే సాధ్యమని బ్రహ్మాస్త్ర సినిమాతో మరోసారి రుజువు అయింది.