Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలినా రారాణి. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అందరు స్టార్ హీరోల సరసన నటించింది. రకుల్ కోసం చాలా మంది దర్శకులు క్యూ కట్టేవారు. తమ సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగే హీరోయిన్ గా కావాలని తన డేట్స్ కోసం సినిమా షూటింగ్ ను కూడా పోస్ట్ పోన్ చేసుకున్న దర్శకులు ఉన్నారు. కానీ.. కాలం గిర్రున తిరిగింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. మరోవైపు బాలీవుడ్ లో బిజీ అయి పోయింది ఈ సుందరి. బాలీవుడ్ లో బిజీగా ఉంటే.. టాలీవుడ్ లో సినిమాలు చేయకపోవడం ఏంటి అంటూ తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చి తన అభిమానులతో ముచ్చటించింది రకుల్. ఈ సందర్భంగా చాలా మంది అభిమానులు తనను చాలా ప్రశ్నలు వేశారు. కొందరు తన తెలుగు సినిమాల గురించి ప్రశ్నించారు. ఓ అభిమాని.. మీరు తెలుగు సినిమాల్లో ఇక నటించరా? హిందీ ఇండస్ట్రీలోనే సెటిల్ అవుతారా? అని ప్రశ్నించగా.. రకుల్ బదులిస్తూ.. నేను ఖచ్చితంగా తెలుగు సినిమాలు చేస్తాను అంటూ బదులిచ్చింది రకుల్.
Rakul Preet Singh : చాలెంజింగ్ స్క్రిప్ట్ వస్తే చేయడానికి నేను రెడీ
తెలుగు సినిమాలు చేయడానికి నేను రెడీ కానీ నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన పాత్ర చేయాలనుకుంటున్నా. నాకు చాలెంజింగ్ గా ఉండాలి. అలాంటి స్క్రిప్ట్ వస్తే నేను చేయడానికి రెడీ. అలాంటి స్క్రిప్ట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా. కాకపోతే నా దగ్గరికి అలాంటి స్క్రిప్ట్ రావడం లేదు. అందుకే నేను ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడం లేదు. నాకు ఎలాంటి భాషాబేధాలు లేవు. స్క్రిప్ట్ బాగుంటే ఏ భాషలో అయినా చేయడానికి నేను సిద్ధం.. అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
రకుల్ తెలుగులో చివరగా కొండపొలం అనే సినిమాలో నటించింది. వైష్ణవ్ తేజ్ ఆ సినిమాలో హీరో. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్. ప్రస్తుతం హిందీలో డాక్టర్ జీ, థాంక్ గాడ్ అనే సినిమాల్లో రకుల్ నటిస్తోంది.