Omkar : తెలుగు బుల్లితెర లో మోస్ట్ పాపులర్ యాంకర్ ఓంకార్. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఓంకార్ ఆట అనే డాన్స్ షో తీసుకువచ్చి ఎంతటి సంచలన విజయాన్ని సాధించాడో మనందరికీ తెలిసిందే. ఆ స్థాయి విజయాలను మళ్లీ ఆయన ఎన్నో అందుకున్నాడు. బుల్లితెరపై ఓంకార్ సూపర్ స్టార్ గా వెలుగుతున్న సమయంలో ఈటీవీ ప్రేక్షకులు ముఖ్యంగా జబర్దస్త్ అభిమానులు ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తెగ తిట్టేస్తున్నారు. కేవలం జబర్దస్త్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఓంకార్ ని నానా మాటలు అనేస్తున్నారు.
అయితే ఓంకార్ ని ఇంతగా తిట్టడానికి కారణం… జబర్దస్త్ ఈ స్థాయి పతనానికి కారణం ఓంకార్ అంటూ ప్రతి ఒక్కరు బల్లగుద్ది మరి చెబుతున్నారు. గతంలో ఓంకార్ జీ తెలుగు ఛానల్ లో కామెడీ కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ కార్యక్రమం జబర్దస్త్ కార్యక్రమాన్ని బీట్ చేయడంలో విఫలమైంది. అందుకే ఆ షోను ఆపేశారు. ఇప్పుడు స్టార్ మా వాళ్ళు కామెడీ స్టార్స్ పేరుతో తెగ హడావిడి చేస్తున్నారు. ఆ కామెడీ స్టార్స్ ని ఓంకార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మల్లెమాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున కామెడీ షోను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా జబర్దస్త్ రేటింగ్ అత్యంత దారుణంగా పడిపోయింది.
Omkar : ఓంకార్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తెగ తిట్టేస్తున్న ఈటీవీ ప్రేక్షకులు

ఓంకార్ తనకు కష్టమైనా నష్టమైన లాభాలు రాకుండా కూడా జబర్దస్త్ నుండి పెద్ద కమెడియన్స్ ని భారీ పారితోషకం ఆఫర్తో లాగడం ద్వారా ఇప్పటికే ఓంకార్ సక్సెస్ అయ్యాడు అంటూ బుల్లితెర వర్గాలు అంటున్నాయి. జబర్దస్త్ లో ఖచ్చితంగా కామెడీ స్టార్స్ ఉండకపోవచ్చు. జబర్దస్త్ నుండి కమెడియన్స్ వెళ్లిపోవడం వల్ల కచ్చితంగా భవిష్యత్తులో జబర్దస్త్ కార్యక్రమాన్ని నిలిపి వేసే స్థాయికి రేటింగ్ పడే అవకాశం ఉంది. అప్పుడు స్టార్ మా లో వచ్చే కామెడీ స్టార్స్ ని కూడా ఆపేస్తారు. దాని ద్వారా స్టార్ మా రేటింగ్ నెంబర్ వన్ గా నిలుస్తుంది. జబర్దస్త్ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఓంకార్ కారణం అంటూ చాలామంది అతడిని తిడుతున్నారు.