Guppedantha Manasu 13 September 2022 Episode : క్యారమ్స్ ఆట ఆడడానికి ఒప్పుకున్న రిషి, సంతోషంలో జగతి, మహేంద్ర

Guppedantha Manasu 13 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 13-September-2022 ఎపిసోడ్ 554 ముందుగా మీ కోసం. జగతి వాళ్లు పూలదండ కడుతూ వుంటే, మహేంద్ర సరదాగా వాళ్లతో మేము కూడా చెయ్యగలం, మగవాళ్లయితే కట్టలేమా అని, సరదాగా మాట్లాడుతూ, వాళ్లు కూడా పూలు కట్టడం మొదలుపెడతారు.అప్పుడు రిషి, వసుధార ఒకరినొకరు చూసుకోవడానిని గమనించిన వీళ్లు, వీళ్ల మధ్యలో మనమెందుకు ఉండటమని, ఒకరి తర్వాత ఒకరు సాకులు చెప్పి, వెళ్లిపోతారు అక్కడి నుంచి,అప్పుడు రిషి,వసుధారల మధ్య రొమాంటిక్ సీన్ మొదలవుతుంది, రిషి,వసు మెడలో దండ వేస్తాడు, దేవయాని అక్కడికి రావడంతో, దాన్ని వెంటనే తీసేస్తాడు, మీరేం చేస్తున్నారు అని అనగానే, దండ కడుతున్నాం అని మాట్లాడుతూ ఉంటారు, ఇంతలో మహేంద్ర వచ్చి ఎక్కడిదాకా వచ్చాయి పనులు అనగానే, వసుధరా ఇంకా ఏమైనా పనులున్నాయ అని రిషి అనగానే, కేక్ ఆర్డర్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది సార్ అని అంటోంది.

Advertisement

Guppedantha Manasu 13 September 2022 Episode : క్యారమ్స్ ఆట ఆడడానికి ఒప్పుకున్న రిషి, సంతోషంలో జగతి, మహేంద్ర

అప్పుడు గౌతమ్ కేక్ ఆర్డర్ చెయ్యడంలో, సెలెక్షన్ చెయ్యడంలో నువ్వు కింగ్ వి కదా నువ్వే చేసేయ్ అనగానే, నేనా అని రిషి అంటాడు, ఒకప్పుడు వసుధార రిషికి తెలియకుండా కేక్ని సెలెక్షన్ చేయించిన సీన్ ని గుర్తు తెచ్చుకుంటారు.అప్పుడు జగతి మనసులో గౌతం అనవసరంగా రిషిని ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకుంటుంది. అప్పుడు మహేంద్ర నాన్న పెళ్లిరోజు, కొడుకు కేక్ సెలక్షన్ చేస్తాడు అని అనడంతో, దాంతో రిషి కేక్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు అందరూ సoతొషపడతారు. అప్పుడు ధరణి బోర్ కొడుతుంది,సరదాగా క్యారమ్స్ ఆడదామా రిషి అనగానే, రిషి సైలెంటుగా వెళ్లిపోతాడు. అప్పుడు చిన్నత్తయ్య నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అనగానే, లేదమ్మా అని జగతి అంటుంది.రిషి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని అనుకుంటూ, మనమైనా క్యారమ్స్ ఆడదామని వీళ్లు ఆడుతూ ఉంటారు. రిషి గదిలో ఉంటాడు. జగతి గౌతమ్ ఒక టీమ్ గా, మహేంద్ర వసుధార ఒక టీమ్ గా ఉండి ఆటను మొదలు పెట్టే సమయంలో, వసుధార రిషికి మెసేజ్ చేస్తుంది, సార్ మీరు కిందికి రండి, క్యారమ్స్ ఆడదామని, దాంతో రిషి కిందికి వస్తాడు.అప్పుడు వసుధార థ్యాంక్యూ సార్ అని, మెసేజ్ పెడుతుంది.

Advertisement
Guppedantha Manasu 13 September 2022 Episode
Guppedantha Manasu 13 September 2022 Episode

క్యారమ్స్ ఆడటానికి మేం రమ్మంటే రాలేదు, ఇప్పుడు వచ్చావు అని గౌతమ్ అనగానే, లేరా నేను ఆడతాను అని గౌతమ్ ని లేపి ఆ ప్లేస్లో రిషి కూర్చుంటాడు.మహేంద్ర నా టీమ్లో వసుధారే కావాలి అని అనడంతో, అదెలా కుదురుతుంది డాడ్ అని, టాస్ వెస్తాను అని మహేంద్ర అని, ఎలాగైనా జగతి రిషి ఒక టీమ్లో వచ్చేలాగా చెయ్యాలి అని, చీటింగ్ చేసి మహేంద్ర వాళ్ళిద్దర్నీ ఒక టీమ్లో వచ్చేలా చేస్తాడు.అప్పుడు మహేంద్ర మేమే గెలుస్తాం కచ్చితంగా అనగానే, లేదు మేమే గెలుస్తాం కచ్చితంగా మీరే ఓడిపోతారు అని, ఆల్ ద బెస్ట్ అని చెప్పుకుంటూ, చెయ్యి ముందుకు చాపుతాడు, జగతితో రిషి ఎలాగైనా మనమే గెలవాలి మేడం అని రిషి అనగానే, జగతి సంతోషంగా అలాగే రిషి అని అంటుంది. దాంతో అందరూ సంతోషపడతారు.సరదాగా ఆట ఆడతారు, ఆటల్లో రిషి జగతి గెలుస్తారు. ఇలా రిషి లో వచ్చిన మార్పుకి చాల సంతోష పడతారు జగతి, మహేంద్ర.వసుధార వలన రిషీ లో చాలా మార్పు వచ్చింది అని, చాలా సంతోష పడతారు. వీళ్ల సంతోషాన్ని చూసి, దేవయాని మీ సంతోషం ఎక్కువ రోజులు వుండనివ్వను, నేను వేసే దెబ్బతో అంతా చెదిరిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది.అయితే దేవయాని ఎటువంటి పన్నాగం పనవుతుందో, దానిని వసుధరా ఎలా ఎదుర్కొబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది.

Advertisement