Guppedantha Manasu 16 August Today Episode : సాక్షి పేరుతో ఉండాల్సిన ఎంగేజ్మెంట్ రింగ్. వసుధార పేరుతో ఉండటంతో అది తట్టుకోలేక ఎంగేజ్మెంట్ని ఆపేసిన సాక్షి. వసుధార రిషిని రిజెక్ట్ చేసి మంచి పని చేశావు అని చెప్పిన సాక్షి.

Guppedantha Manasu 16 August Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 16-aug-2022(530) ఎపిసోడ్ ముందుగా మీ కోసం…. సాక్షి పేరుతో ఉండవలసిన ఉంగరము వసుధార పేరుతో ఉండేసరికి సాక్షి తట్టుకోలేక అందరినీ నిలదీస్తోంది. రిషి ఏదో పొరపాటున జరిగిందని చెప్తాడు. పొరపాటున జరగడం ఏంటి రిషి నా పేరు గుర్తులేదా లేక వసుధ ప్రేమని మర్చిపోలేకపోతున్నా వా అని నిలదీస్తుంది దేవయాని సాక్షి వాళ్ల పేరు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు.నా బాధ అది కాదు పూర్తిగా నా పేరు మర్చిపోయి జీవితాంతం వసుదార పేరునే తలుస్తూ ఉంటాడేమో ప్రతి విషయంలో వసుధారాఅని నన్ను అంటుంటే ఆ బాధ ఎలా వుంటుంది అని సాక్షి వివరిస్తుంది.సాక్షి అనే పేరుకు బదులు జీవితాంతం వసుదార అని మనసులో ముద్రించుకుని ఉన్నాడు. రిషి ఈ పేరుతోనే నేను జీవితాంతం బతకాలా నాపేరు మర్చిపోవాలా చెప్పండి అని నిలదీస్తుంది ఇంట్లో వాళ్లందరినీ సాక్షి. వసుధార అని పిలుస్తుంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది మానసికంగా నన్ను చంపేసి ఉంటాడు. ఇలా బతకడం నావల్ల కాదు ఈ పెళ్లి నాకు వద్దు అని ఉంగరం విసిరేస్తుంది సాక్షి. ఈ నరకం నాకొద్దు ఈ బాధ భరించలేను మానసికంగా నన్ను చంపేయడం మీకు ఇష్టమేనా అని ఏడుస్తూ ఉంటుంది సాక్షి.దేవయాని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వద్దు అంటి ఈ పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏడవాలి ఆపేస్తే ఈ ఒక్కరోజే ఏడుస్తాను. నన్నర్ధం చేసుకోండి అని సాక్షి చెప్తోంది.

Advertisement

రిషి అందరూ నీ గురించి చెబుతుంటే ఏదో అనుకున్నాను. తల్లిని కాదు అనుకుంటే తప్పు అంటిది అనుకున్నాను. వసుదార నిన్ను కాదంటే ఈ పిచ్చిది నిన్నెందుకు కాదు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు. నీకు ప్రేమించటం తెలియదు. నీకు ప్రేమ విలువ తెలియదు అని సాక్షి అంటోంది జగతి ఆంటీ మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటోంది. సాక్షి ఆవేశం తగ్గించుకో అని దేవయాని చెప్తే. ఆంటీ మీకో దండం మీ అబ్బాయి కో దండం. మీరు ప్రేమకు ఒక దండం అని చెప్తుంది. జీవితాంతం బాధపడతావు సాక్షి అని దేవయాని అంటే బాధపడ్డాం కాదు నేను సంతోషపడతాను.ఈ పెళ్లి వద్దనుకొని నేను గొప్ప పని చేస్తున్నాను దానికి గర్వపడుతున్నాను అని సాక్షి అంటోంది.సాక్షి ఆవేశంతో చాలానే మాటలు అంటోంది. తర్వాత సాక్షి వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని వెళ్లిపోతుంది. సాక్షి విసిరేసిన ఉంగరం వసుదార తీసుకుని బయటికి వెళ్తుంటే. వసుదారకి సాక్షి ఎదురుపడుతుంది.ఆగిపోయిన ఎంగేజ్ మెంట్ గురించి సాక్షి మాట్లాడుతుంది. వసుధరా తన వ్యక్తిత్వం గురించి ఎదుటివారు లోనే తన సంతోషం చూసుకోవడం గురించి మాట్లాడుతోంది. అలా వాళ్ళిద్దరి సంభాషణ కొద్దిసేపు జరుగుతుంది ఇదంతా రిషి కూడా వింటాడు.వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే రిషి అక్కడికి రాగానే వసుదార ఈసందర్బంగా నీకొక విషయం చెబుతున్నాను.

Advertisement

Guppedantha Manasu 16 August Today Episode : వసుధార రిషిని రిజెక్ట్ చేసి మంచి పని చేశావు అని చెప్పిన సాక్షి.

Guppedantha Manasu 16 August Today Episode
Guppedantha Manasu 16 August Today Episode

రిషీని కాదనను నువు చాలా మంచిపని చేశావు నువ్వీమాటమీద ఉంటూ అనే సాక్షి చెప్తోంది.తనకి అసలు ప్రేమ విలువ తెలియదు ప్రేమించడం తెలియదు అమ్మాయిలని గౌరవించడం తెలియదు.కన్న తల్లిని అమ్మా అని పిలవడం తెలియదు. అని తనని ఇన్సల్ట్ చేసే మాట్లాడుతూ ఉంటుంది సాక్షి .వసుదార నికు ముందే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు. నాలాంటి బాధ నీకు రాకూడదూ. ఈరోజు నా ముందు నీ పేరు తలుస్తున్నాడు. రేపు నీ ముందు ఇంకొకరి పేరు తలుస్తాడు ఏమో. నువ్వే మాయలో పడలేదు సంతోషం ఇలాగే వుండు అని సాక్షి చెప్తుంది.నేను వెళుతున్నాను అంతే నీ జీవితంలో నుంచి వెళ్లడం లేదు నా బాధ నా కడుపు మంట అన్నీ ఏదో ఒక రూపంలో నీకు ఖచ్చితంగా తగుల్తాయి. ఇది శాపం అనుకుంటావా నాశపథం అనుకుంటావు నీ ఇష్టం. బాయ్ అని చెప్పి వెళుతోంది సాక్షి కానీ రిషి జీవితంలోకి ఎవరు రాకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ వెళ్తోంది సాక్షి.

తర్వాత వసుధార కూడా ఏం మాట్లాడకుండా సైలెంటుగా వెళ్లిపోతుంది.మహీంద్రా రిషి దగ్గరికి వచ్చి చాలా సంతోషపడతు ఉంటాడు. నీ నమ్మకమే గెలిచింది నిన్ను తిట్టుకున్నాను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని మహేంద్ర చెప్తాడు.నీ మనసు గెలిచింది. నీ ప్రేమ గెలిచింది. మనుషులు ఇప్పుడు ఓడిపోవచ్చు కానీ మనసు ఎప్పుడు ఓడిపోదు డాడీ అని చెప్తాడు రిషి.గౌతమ్ ధరణితో వదినా మంచి ట్వీట్ కావాలి అని అడుగుతాడు. జగతి అకేషన్కోసం చేసిన సీట్లు ఉన్నాయి కదా అని అంటే. అవి వద్దు వేరే స్వీట్స్ కావాలి అని చెప్తాడు గౌతమ్.ఇంతలో దేవయాని వచ్చి ఏంటి జగతి నువు చేస్తున్నది. ఇంట్లో శుభకార్యం ఆగిపోతే స్వీట్సు తినాలని ఉందా అని అంటోంది. అది నేను కావాలని అనలేదు అక్కయ్యా గౌతమ్ అడిగాడు అని చెప్తుంది జగతి. గౌతమ్ అడిగితే నువ్వు వదు అని చెప్పాలి కదా అని అంటోంది దేవయాని.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement