Guppedantha Manasu 18 October 2022 Episode : చిన్నితరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 584 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… వసుధార రూమ్లో రిషి తన చేతుల్ని పట్టుకొని నీకు నేను ఎక్కువ.. ఆ జగతి మేడం ఎక్కువ.. అని అడగగానే.. అప్పుడు వసుధార నాకు జగతి మేడమే ఎక్కువ అని చెప్తుంది. అప్పుడు రిషి తన చేతుల్ని ఒక్కసారిగా వదిలేసి మరి నేనేంటి వసుదార అని అడుగుతాడు. అప్పుడు వసుధార మీరు నా జీవితం నా సర్వస్వం నేను మీరు వేరు కాదు అని చెప్తుంది. అప్పుడు రిషి నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా భలే మాట్లాడతావు వసుధార? నీ టాలెంట్ చాలా ఉంది అని చెప్తూ మనిద్దరి మధ్య ఈ అడ్డు కూడా ఎందుకు వసుధర ఈ గురుదక్షిణ విషయాన్ని ఇక మర్చిపో అని చెప్తాడు అప్పుడు వసుధార మీరు నన్ను మర్చిపోగలరా అది కూడా అంతే అని చెప్తుంది. అప్పుడు నీ ఆలోచన నా ఆలోచన వేరైనప్పుడు మర్చిపోగలను ఇక నువ్వు నేను కలిసి నడవలేము అని అంటాడు. అప్పుడు వసుధర ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి సార్ అని చెప్తుంది. అప్పుడు రిషి నువ్వు మొండి దానివి ఇక నువ్వు మారవని నాకు అర్థమైంది అని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
Guppedantha Manasu 18 October 2022 Episode : అలా జరగనివ్వను అంటున్న వసుధార…
వసుధార బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే జగతి మహేంద్ర రిషి వసుధారాల గురించి మాట్లాడుకుంటూ భయపడుతూ ఉంటారు. అంతలో అక్కడికి ధరణి వచ్చి చిన్న మామయ్య రిషి ఇంటికి రానని పెద్ద అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పాడు మీరు కంగారు పడకండి కానీ దేవయాని అత్తయ్య గారు మీ మీద ఒక కన్నేశారు తన ప్రవర్తన చాలా వింతగా ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు జగతి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మహేంద్ర అని చెప్తుంది. కట్ చేస్తే రిషి కాలేజ్ దగ్గరికి వెళ్తాడు అక్కడ గౌతమ్ ని చూసి నువ్వు డిటెక్టివ్ గా చేయడానికి ఎంత డబ్బులు తీసుకుంటున్నావ్ అని అంటాడు అప్పుడు గౌతమ్ అదేంట్రా అలా అంటున్నావు అనగానే నాకు నిన్ను ఎవరు పంపించారు నాకు తెలుసు అని చెప్తాడు. అప్పుడు గౌతం నువ్వు ఈగో ని పక్కన పెట్టి ఉసుదారాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండరా అని చెప్తాడు.

అప్పుడు రిషి గౌతమ్ ని పక్కకి తీసుకెళ్లి తన జీవితం గురించి అంతా చెప్పి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ వసుధారా కి ఇస్తున్నాను తను మాత్రం వేరే విషయాన్నీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరిది ఇందులో తప్పుందిరా చెప్పు నాదేమన్నా ఉందా అని అడుగుతాడు అప్పుడు గౌతమ్ ఏం లేదురా అని చెప్తాడు.
ఇక రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా గౌతం ఇంటికి వెళ్దాం రారా అని అడగగా నేను రాను అని చెప్తాడు అప్పుడు గౌతం కూడా నేను కూడా ఇంటికి వెళ్ళను అనగానే సరే అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక కట్ చేస్తే వసుధార రిషి ఫోటోలు చూస్తూ ఫీలవుతూ తనకి ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ తీయడు మళ్లీ మెసేజ్ పెడుతుంది దానికి కూడా రిప్లై ఇవ్వడు తర్వాత జగతి మేడం గురించి ఆలోచించుకుంటూ తనకి ఫోన్ చేస్తుంది అప్పుడు తను కూడా ఫోన్ తీయదు మళ్లీ చేస్తుంది అప్పుడు మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి జగతితో మాట్లాడమని చెప్తాడు.
అప్పుడు వసుధార రిషి సార్ ఇంటికి వచ్చారా భోజనం చేశారా అని అడుగుతుండగా జగతి ఏడుస్తూ రిషి ఇంటికి రానని చెప్పాడంట అంటుంది అప్పుడు మహేంద్ర ఫోన్ తీసుకొని రిషి ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అడగగా వసుధార నాకు తెలియదు సార్ అని మేడం ఎలా ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు మహేంద్ర ఏమి మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు.
అప్పుడు వసుధార ఫోన్ ఎందుకు కట్ చేశారు అని అనుకుంటూ రిషి సారి ఎక్కడున్నారు అని కంగారు పడుతూ ఉంటుంది. కట్ చేస్తే కాలేజీలో ఉన్న రిషికి గౌతం భోజనం తీసుకువచ్చి పెడతాడు అప్పుడు ఇద్దరు కలిసి తింటూ ఉంటారు రిషి ఆ భోజనాన్ని గుర్తుపట్టి నువ్వు ఇది ఎక్కడ తీసుకొచ్చావు రా అచ్చం ఇంటి భోజనంలా ఉంది అని అడుగుతూ ఉంటాడు.
కానీ గౌతం ఏమి చెప్పడు అప్పుడు రిషి వసుధారని గుర్తుపట్టి బయటి ఎంతసేపు నిలబెడతావురా కాళ్ళు నొప్పులు వస్తాయి లోపలికి రా అని పిలుస్తాడు. అప్పుడు వసుధార ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…