Guppedantha Manasu 22 Augest 2022 Episide : గుప్పెడంత మనసు సీరియల్ 22-August-2022 ఎపిసోడ్ 535 ముందుగా మీ కోసంవసుధార రింగ్ మెడలో వేసుకుని, ఫొటో దిగుతూ వుండగా, రిషి అక్కడికి వస్తాడు. దాంతో చున్నీతో కవర్ చేస్తుంది, ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతుంది.అప్పుడు రిషి ఎందుకు అంత కంగారు పడుతున్నావు, నువ్వూ ఇంతకుముందులాగా లేవు అని అనగానే, సార్ ఎవరైనా ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా సార్ మారుతూ ఉంటారు కదా, అని అంటూ, బుక్సన్నీ సర్దుతూ ఉంటుంది. అప్పుడు వసుధార మెడలో చూసి, ఏంటి ఆ దారం అని అడుగుతాడు రిషి , ఏం లేదు సార్ అని అంటుంది వసుధార. రిషి వసుధార బుక్ తీసుకుని కొన్ని మార్క్ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ ఈరోజే చదవాలి అని, బాగా చదవాలి, నీ లక్షాన్ని మర్చిపోవద్దు అని చెపుతూ, తరువాత వసుధార చేతిలో డబ్బులు పెట్టి, డబ్బులు అడిగావంట కదా, అని ఇవి మేనేజర్కి ఇవ్వు, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్నే అడుగు, ఇంకెవరినీ అడగొద్దు అని చెప్పి, చదువు మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి వెళ్లిపోతాడు.
Guppedantha Manasu 22 Augest 2022 Episide : నీ లక్ష్యం ముఖ్యమని, వసుధార కి చెప్పిన రిషి
తెల్లవారాక రిషి ఫోన్ పట్టుకుని వసుధారకు ఫోన్ చెయ్యనా అని ఆలోచిస్తూ ఉండగా, గౌతమ్ వస్తాడు, ఇంతలో వసుధార ఫోన్ చేయగానే, గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి వసుధార ఇక్కడికే వచ్చావా అని అనగానే, రిషి కిందికి వెళతాడు.ధరణి వసుధార ని కాఫీ తాగుతావా అని అనగానే, అక్కడికి దేవయాని వచ్చి, నువ్వు వెళ్లు అని ధరణితో చెప్పి, ఏంటి ఇక్కడికొచ్చావు అని వసుధార ని అడుగుతుంది. రిషి సారే రమ్మన్నాడు అని మాట్లాడుతూ ఉండగా, ఇంతలో రిషి వచ్చి, పెద్దమ్మ నేను మాట్లాడతాను, మీరు వెళ్లండి అని అంటాడు. ఏంటి వచ్చావు వసుధార అని అనగానే, మీరు నిన్నొక పనిచెప్పారు, అది చేశాను చెప్పడానికే వచ్చాను సార్ అని అంటోంది. కొద్దిసేపయ్యాక కాలేజీలోనే చెప్పొచ్చు కదా అని అనగానే,ఇంతలో గౌతమ్ కూడా వస్తాడు, గౌతమ్ నువ్వు వెళ్లు మేము ఇంపార్టెంట్ డిస్కషన్ చెయ్యాలి అని గౌతమ్ ని పంపిస్తాడు రిషి, వసుధారతో నువ్వెళ్ళు కాలేజ్లో మాట్లాడదాం అని అంటాడు రిషి.
గౌతమ్ జగతి మహీంద్ర దగ్గరికి వచ్చి వసుధార వచ్చింది అని చెపుతాడు.తరువాత జగతి వసుధారకి ఫోన్ చేసి, ఇంటికి వచ్చి కలవకుండానే వెళ్లిపోయావు అని, ఇలా కొద్దిసేపు మాట్లాడుతూ, చదువు, నీ లక్ష్యం ముఖ్యమని చెబుతుంది, అలాగే మేడం అని అంటుంది వసుధార. ఇంతలో సాక్షి వస్తుంది, వసుధార దగ్గరికి, సాక్షి వసుధారతో రిషి గురించి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార నీకు రిషి సార్ గురించి మాట్లాడే హక్కు ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు సాక్షి అని అంటూ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వసుధార కాలేజ్ కి వెళ్లగానే రిషి కారుని చూసి, కొద్దిసేపు రిషి సార్ అని అనుకొని మాట్లాడుతూ ఉంటుంది కారుతో,కారు వెనుకాలే రిషి ఉంటాడు, ఏమైంది వసుధార కి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. రిషి వెనక్కి తిరిగి చూడగానే, రిషి ని చూసి షాక్ అవుతుంది వసుధార. ఇంతటితొ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.