Guppedantha Manasu 25 Augest 2022 Episide : రిషికి తన మనసులో మాట చెప్పి ప్రపోజ్ చేసిన వసుధార. రిషి తనని అర్థం చేసుకుంటాడా అపార్థం చేసుకుంటాడా.

Guppedantha Manasu 25 Augest 2022 Episide : గుప్పెడంత మనసు సీరియల్ 25-aug-2022  ఎపిసోడ్ 538 ముందుగా మీ కోసం….ఫేర్వెల్ పార్టీలో వసుధార స్పీచ్ మొదలుపెడుతుంది తన కాలేజీలో జాయిన్ అయిన విధానం అన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. వస్తువు ద్వారా చాలా ఎమోషనల్గా అన్ని గుర్తుతెచ్చుకుని సెంటిమెంటుగా మాట్లాడి చాలా బాధ పడుతుంది. కాలేజీని వదిలిపెట్టి వెళ్లలేకపోతున్నాను అని ఏడుస్తుంది. అలాగే తన గుర్తింపుకి కారణమైన మహేంద్ర,జగతికి రిషికి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత స్టూడెంట్స్ అందరూ రిషితో ఫొటోలు దిగుతూ ఉంటారు. అలాగే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటూ ఉంటారు. అది వసుధార చూస్తుంది.పుష్ప కూడా రిషి దగ్గరికి వెళ్లి సార్ మనం అందరం కలిసి ఫోటో దిగుదామా అని అడుగుతుంది. వసుధరని కూడా పిలుస్తుంది. అలా వసుదార రిషి పక్కన నిలబడి అందరూ కలిసి ఫోటో దిగుతార.తర్వాత కాలేజ్ నుండి వసుదార చెప్పకుండానే వెళ్లిపోతుంది. రిషి కార్లో వెళ్తుండగా ఏంటి వర్షం రాబోతుంది వసుదార అసలు ఎక్కడికి వెళ్లింది. ఈ వర్షం నాకేదో చెప్పాలనుకుంటుంది అని అనుకునే లోపే రోడ్డుపైన వసుధార కనిపిస్తోంది.

Advertisement

Guppedantha Manasu 25 Augest 2022 Episide : రిషికి తన మనసులో మాట చెప్పి ప్రపోజ్ చేసిన వసుధార.

రిషి వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నావు వసుదార అని అడిగితే మాట్లాడాలని వుంది సార్ గుండెల్లో బరువు మొయ్యలేకపోతున్నాను బరువు దించుకోవాలని అనుకుంటున్నాను అని వసుధార అనగానే, రిషి పద వెళ్దాం కారులో వెళ్తూ మాట్లాడుకుందాం వర్షం పడేలా ఉంది అని అంటే సరదాగా మాట్లాడుకున్న కబుర్లు కాదు సార్ కారులో వెళ్తూ మాట్లాడటానికి మనస్ఫూర్తిగా మీకు చెప్పాలి అని చెప్పి అంటోంది. దాంతర్వాత వసుధార చెప్పే మాటలు రిషి కి ఏమీ అర్థం కావు నువ్వేమంటున్నావు నాకేం అర్థం కావట్లేదు అని రిషి అంటే,బస్సు ద్వారా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటోంది ఏంటి వసుదార ఏమీమాట్లాడ లేవు అని రిషి అంటే మాట్లాడితేనే మనసులో మాట చెప్పినట స్సార్ మనసు మనసుతో మాట్లాడుతూ మాట్లాడతా అని అంటోంది వసుధరా. ఏంటి వస్తారా ప్రశ్న అడక్కుండానే సమాధానం అడుగుతున్నావు అని రిషి అంటాడు అప్పుడు వసుదార తన బ్యాగ్లో వున్న గిఫ్ట్ తీసి చూపిస్తుంది. వెంటనే రిషి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొంటారు.

Advertisement
Guppedantha Manasu 25 Augest 2022 Episide
Guppedantha Manasu 25 Augest 2022 Episide

పగిలిన బొమ్మను ఎందుకు గుర్తు చేస్తున్నావు అది నా మనసు విరిగిపోయింది అని రిషి అంటాడు పగిలింది అద్దం మాత్రమే సార్ అద్దంలాంటి మన మనుషులు కావు. దీన్లోనే మన బంధం ఉంది అని చెప్పి వసుధార అంటోంది.దాంతర్వాత వియ్ ఆర్ అనే కలిసిచేపిచిన ఉంగరం వసుధార చూపిస్తుంది.బస్సు ద్వారా పగిలిన అద్దాలని అతికించి నాకు చూపిస్తున్నావా ఒకప్పుడు నువు మాట్లాడిన మాటలన్నీ నాకింకా గుర్తున్నాయి. నన్ను చాలా బాధ పెడుతున్నాయి అని రిషి అంటాడు.ఇదంతా ఏంటి వస్తారా అని రిషి అంటే ప్రేమ సార్ అని చెప్తుంది. ఒకప్పుడు మీరు ప్రపోజ్ చేసినప్పుడు నో చెప్పడానికి ఎవరో బెదిరిస్తే బెదిరించినందుకు మీకేదో జరుగుతుందని భయపడి మాత్రమే నేనారోజు అలా చేశాను అలాగే కాదు అని చెప్పినందుకు మీరంతా బాధపడుతున్నారో మీతో అలా చెప్పినందుకు నేను కూడా బాధపడుతూ ఉన్నాను అని వసుధార అంటోంది.

ఇదంతా తెలుసుకోవడానికే నాకు టైం పట్టింది సార్. భూమిలో విత్తనాలు నాటితే మొక్క రావడానికి టైం పడుతుంది కదా ఇది కూడా అంతే నాకు ఇన్ని రోజులు టైం పట్టింది సార్ అని చెప్తుంది వసుదార.మీకు ఇన్ని రోజులు చేద్దామంటే మీరు అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో అని భయపడి నేను చెప్పలేదు సార్ అని వసుధార చెప్తుంది.మిమ్మల్ని పెట్టిన బాధతోపాటు ప్రతిక్షణం మీరే గుర్తొస్తున్నారు సార్ మీరు నాకు కావాలి మీ ప్రేమ కావాలి జీవితాంతం మీతో నా ప్రయాణం కొనసాగాలి వి అనేది ఒంటరి అక్షర దానికి ఆర్ అనే అండగా మీరుండాలి ఎప్పుడూ మీతో కలిసి నేను ప్రయాణం చెయ్యాలి అని చెప్పి వసుధరా అంటోంది. ఇక్కడ ఉన్నది రెండు గుండెలైనా రెండు గుండెల చప్పుడు ఒక్కటే దానిపేరే ప్రేమ. నన్ను క్షమించండి సార్ అని చెప్పి తర్వాత వసుధార ఐ లవ్ యూ సార్ అని రిషికి ప్రపోజ్ చేస్తుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement