Guppedantha Manasu 25th July Today Episode : గుప్పెడoత మనసు సీరియల్ 25-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం….. రిషి, వసుధార మీద కుట్రతో వీడియో తీసిన సాక్షి

Guppedantha Manasu 25th July Today Episode :(ఎపిసోడ్ 511) మహేంద్ర కాఫీ తాగుతూ, కాఫీ చాలా బాగుంది ధరణి అని అంటూ ఉంటారు. అప్పుడు దేవయాని కాఫీ బాగుంది. ఈ మద్య మనుషులు, మాటలు మారుతున్నారు లే అని వెటకారంగా అంటూ ఉంటుంది. రిషి లేచాడా ధరణి అని దేవయాని అడుగుతుంది. అప్పుడు ధరణి ఉదయమే వెళ్లాడు అని అంటుంది. సరిగ్గా చూశావా, నాకు కనిపించలేదు కదా, అని దేవయాని అనగానే, నేను పొద్దున్నే లేస్తాను కదా అత్తయ్యగారూ అని అంటుంది. అప్పుడు దేవయాని నేను బారెడు పొద్దు దాకా లేవను అని నీ ఉద్దేశమ అని అంటూ ఉంటుంది.

అప్పుడు మహేంద్ర నవ్వుతూ, మీరు ఇంటికి పెద్దవారు మీరు లేస్తే ఏంటి, లేవకపోతే ఏంటి మిమ్మల్ని ఎవరు అడుగుతారు అని అంటూ, ఉంటాడు. ఇలా కొద్దిసేపు వాళ్ళు వెటకారము గా మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధార ఆటో దిగి కాలేజ్ లోపలికి వెళుతూ, మనస్సులో ఎలాగైనా ఈ చదువుల పండగని సక్సెస్ చేయాలి. కొత్తగా ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఈ మధ్యన రిషి సార్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సాక్షి ఈరోజు ఎలాగైనా నేనే గెలవాలి. ఈ రోజు నా రోజు అని అనుకుంటూ, దేవయాని కి ఫోన్ చేస్తుంది.

Guppedantha Manasu 25th July Today Episode : రిషి, వసుధార మీద కుట్రతో వీడియో తీసిన సాక్షి

Guppedantha Manasu 25th July Today Episode
Guppedantha Manasu 25th July Today Episode

ఈరోజు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు దేవయాని ఆల్ ద బెస్ట్ చెబుతోంది. తరువాత సాక్షి ఏదో ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇంతలో వసుధార ఏదో కొన్ని వస్తువుల కోసం స్టోరూమ్కు వెళుతూ ఉంటుంది. కానీ అక్కడ ముందే రిషి కూడా ఉంటాడు స్టోర్ రూమ్లో. రిషి వసుధారని చూసుకోకుండా సెక్యూరిటీ ఇప్పుడా నువ్వు వచ్చేది, అక్కడ సీజర్ ఉంది చూడు తీసుకురా అని అంటాడు. అప్పుడు వసుధార తేస్తాను సార్ అని అనగానే రిషి వెనక్కి తిరిగి చూస్తాడు.

రిషి వసుధారతో నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. స్టోర్రూమ్లో చిన్నపనుంది సార్ అని అంటుంది. నీకేం పని అని అంటాడు రిషి. అప్పుడు వసుధార మీరెందుకొచ్చారు సార్ ఇక్కడికి అని అడుగుతుంది. నన్నే అడుగుతున్నావు, నువ్వు సమాధానం చెప్పావు కదా నీ పని నువ్వు చేసుకో నా పని నేను తీసుకుంటాను అని రిషి అంటాడు. ఇంతలో మళ్ళీ సీజర్ అడుగుతాడు, అది ఇవ్వబోయి వసుధార కుర్చీ తగిలి అనుకోకుండా ఇద్దరూ వలలో చిక్కుకుపొతారు రిషి , వసుధార.

ఇదంతా సాక్షి వీడియో తీస్తూ ఉంటుంది. వీడియోను చూస్తూ ఈరోజు మీ పని చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మహేంద్ర , జగతి కాలేజ్ కి వస్తూ ఉంటారు, కారుదిగి జగతి, మహేంద్ర తో ఈరోజు రిషి తొందరగా వచ్చాడు. ఏదో పని ఉండి ఉంటుంది. ఏదైనా హెల్త్ కావాలేమో అడుగు మహేంద్ర అని అంటూ ఉంటుంది. ఇంతలో సాక్షిని చూసి ఏంటి ఇంత త్వరగా సాక్షి వచ్చింది అని అనుకుంటూ వెళ్తారు. ఇంత త్వరగా వచ్చావు సాక్షి అని అడగగానే, ఎవ్వరూ రమ్మనలేదు నేను రిషి కోసం వచ్చాను, పిలవకపోయినా వచ్చాను అని కొంతమంది అనుకుంటారు.

అని ఇలా వాళ్లతో కొద్దిసేపు వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది.సాక్షి మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అని అడగగానే, మంచిపనులకు మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. వంకర పనులకు బ్లెస్సింగ్స్ ఆశించకూడదు అని అంటూ ఉంటుంది జగతి, అక్కడ నుంచి వెళ్లిపోతారు.తర్వాత రిషి వసుధారతో ఎందుకు ఇలా పనులు చేస్తూ నీ టైమ్ని, ఆరోగ్యాన్ని, పాడుచేసుకుంటున్నావు, అని అడగగానే, ఎలాగైనా ఈ చదువులో పండగని సక్సెస్ చేద్దాము అని అందుకే త్వరగా వచ్చాను సార్ ఏదైనా గ్రేట్గా చెయ్యాలి, అని ఆలోచిస్తున్నాను, అని సమాధానం చెబుతుంది.ఇలా వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు.

నేను ఒక జెండాని తయారు చేశాను సార్ డీబీఎస్టీ కాలేజ్ పేరుతో నేను చూపిస్తాను అని అడగగానే, ఆగు అని తన ఫోన్లో ఫోటోని చూపిస్తాడు. నేను తయారుచేసింది కూడా ఇదే సార్ మీరు కూడా సేమ్ ఇలానే చేశారు అని అంటూ ఉంటుంది. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో జగతి, మహేంద్ర అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళని చూసి వీళ్లు మాట్లాడడం ఆపేస్తారు.

అందరూ కలిసి చదువుల పండగ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.వసుధార మనసులో ఇద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది.ఇంతలో గౌతమ్ సాక్షి ని చూడగానే, సాక్షి దగ్గరికి వెళ్లి, నీతో ఒక విషయం చెప్పాలి సాక్షి అని అనగానే, చెప్పు అని అంటుంది. సాక్షి ఇప్పుడు కాదులే తర్వాత చెప్తాను అని అంటాడు గౌతమ్. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.