Guppedantha Manasu 28 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 28-September-2022 ఎపిసోడ్ 567 ముందుగా మీ కోసం. రిషి జగతి తో మాట్లాడిన మాటల్ని వింటూ, అక్కడికి వచ్చిన దేవయాని, ఈ అవకాశాన్ని వదిలి పెట్టుకోవద్దని జగతిని నిలదీస్తూ ఉంటుంది, ఎందుకు బాధపెడుతున్నావు రిషి ని, ఈ నాటకాల ఏంటి అని, అప్పుడు మహేంద్ర దయచేసి ఈ విషయం గురించి మీరు మాట్లాడకండి వదినగారు అని అనడంతో, అంటే మీరందరూ ఒకటి, నేను పరాయా మనిషినా అని ఏడుస్తూ నాటకాలు ఆడుతూ ఉంటుంది రిషి ముందు, దేవయాని మాటలను నమ్మిన రిషి డాడ్ మీరు మాట్లాడిన పద్ధతి నాకు నచ్చలేదు, అని దేవయానిని అక్కడి నుంచి తీసుకొని వెళతాడు, వెనక్కి తిరిగి దేవయాని మహేంద్ర వైపు చూస్తు నవ్వుకుంటూ వెళుతుంది, కావాలని జగతి మహేంద్ర లను రిషి కి దూరం చేస్తుంది దేవయాని. జగతి, మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు.రిషి కోపంగా బయటికి వెళ్ళిపోతూ వుంటాడు. ఒకవైపు వసుధార గుడిలో దండం పెట్టుకుంటుంది.
ఏంటమ్మా ఓక అమ్మని అమ్మా అని పిలవడానికి ఇన్ని ఆటంకాలు, ఏంటి అమ్మ రిషి సార్, జగతి మేడమ్ కలుస్తారా లేరా అని అనుకున్నాను, మీ దైవంలా కలిశారు, అన్నీ చేసిన నువ్వు మళ్లీ అమ్మా అన్న పిలుపుకి దూరం చేస్తున్నావు, రిషి సార్ చేత అమ్మ అని పిలిపించాలి అని నేను అనుకోవడం తప్పు అంటున్నారు. ఏంటమ్మా అని దేవుడితో మాట్లాడుతూ ఉండగా, అక్కడికి రిషి వస్తాడు, తప్పే అలా అనుకోవడం అని అంటూ, నేను ఎన్నో మెట్లు దిగాను, ఇంటికి తీసుకొచ్చాను డాడ్ సంతోషం కోసం, కాలేజ్ ఫ్యాకల్టీగా ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇన్ని చేశాక కూడా అవి గుర్తించకుండా, అమ్మా అని పిలవలేదు అని మాత్రమే అంటున్నావు, కోపిష్టి అని మాత్రమే అంటారు, జగతి మేడమ్ నీ దగ్గరికి ఎందుకొచ్చారు, మీ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు అని రిషి ప్రశ్నిస్తూ ఉంటాడు వసుధారని, అప్పుడు వసుధార జరిగిన విషయం చెబుతూ ఉంటుంది. మీ సంతోషం కోసం అమ్మ అని కూడా పిలవకపోయినా ఫర్వాలేదు అని అడిగింది అని చెబితే, అసలు ఆవిడకి లేనిది నీకెందుకు నువ్వెందుకు పిలవాలని కోరుకుంటున్నావు అని అనడంతో, ఏ అమ్మ తనని అలా పిలిపించుకో కూడదు అని ఉండదు సార్.
Guppedantha Manasu 28 September 2022 Episode : ఆ కోపాన్ని వసుధార పోగొట్ట గలుగుతుందా?

ఎన్నో సార్లు గుండెను చంపుకొని ఆ మాట అంది, మీ సంతోషం కోసమని, అన్నీ మంచి లక్షణాలున్న మీలో, సొంత తల్లిని అమ్మా అని పిలవలేదు అని చెడు లక్షణం ఉండకూడదని నా ప్రయత్నం అని ఇలా ఇద్దరు జగతి విషయంలో మాట్లాడుకుంటూ ఉంటారు, రిషి కోపంగా గుడిలో గంట కొడుతూ ఉంటాడు, రిషి చేతికి రక్తం కూడా వస్తుంది, కోపంగా వెళ్లిపోతాడు అక్కడి నుంచి, వసుధార దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ ఉంటుంది, అమ్మా ఎలాగైనా రిషి సార్ మనసును నువ్వే మార్చాలి అని దణ్ణం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది, రిషి వెనకాలే వెళుతూ, కారులో ఎంత ప్రయత్నించినా కూడా వినడు హాస్పిటల్ కి వెళదామంటే, తనని బస్స్టాండ్ లొ దింపేసి, వెళ్లిపో అని చెప్పి రిషి కాలేజీ గెస్ట్ హౌస్ కి వెళతాడు. వసుధార కూడా రిషి వెనకాలే వెళ్ళి, రిషి చేతికి కట్టు కడుతూ ఉంటుంది, రిషి నువ్వు ఎందుకు కట్టుకడుతున్నాయి అని అనగానే, మీ మీద ప్రేమ సార్ మిమ్మల్ని వదిలిపెట్టనని ఆరోజే చెప్పాను కదా అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంత ప్రేమని పెట్టుకొని, నాతో ఎందుకు గొడవ పడుతున్నావు అని రిషి అనగానే, నిజమైన ప్రేమంటే మనలోని తప్పులను సరిదిద్దడమే సార్ అని, ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.