Guppedantha Manasu 5 August Today Episode 521 : దేవయాని కుట్రను ఇంట్లోవాళ్లు తెలుసుకోగలరా….. దేవయాని చేసిన కుట్ర వలన రిషి బలి అవుతాడా

Guppedantha Manasu 5 August Today Episode 521 : గుప్పెడంత మనసు సీరియల్ 5-aug-2022 (521) ఎపిసోడ్ ముందుగా మీ కోసం. మహేంద్ర, జగతి, గౌతమ్, సాక్షి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సాక్షికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అలా మాట్లాడటానికి అని గౌతమ్ అంటాడు.పెద్దమ్మ తో అలా మాట్లాడిందంటే డైరక్టుగా రిషిని కూడా అన్నట్టే కదా అనే గౌతమ్ అంటాడు. నాకు అదే అర్థం కావట్లేదని జగతి కూడా అంటోంది.దేవయాని అక్కయ్యా సాక్షి ఇద్దరూ అలా మాట్లాడుకున్నారంటే నాకు ఇప్పటికీ కూడా నమ్మ బుద్ది కావట్లేదు అని జగతి అంటోంది ఎక్కడో ఏదో జరుగుతుంది అని అంటోంది మహేంద్రతో అంటుంది.ఇలా ముగ్గురు కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి, వసుధార బయట కూర్చుని చలి మంట పెట్టుకొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.

తరువాత రిషి వసుధార ని ఒకమాట అడుగుతాడు. ఆ రోజు కాదని, అంతా జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు వసుధార మనసులో నిజం చెప్పాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పినా మీరు నమ్మేలా లేరు అని అనుకుంటూ ఉంటుంది. ఇలా కొద్ది సేపు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వసుధార సార్ ఈ టాపిక్ వద్దు ఇప్పుడు అనగానే, మరి సాక్షి గురించి మాట్లాడుకుందామా అని రిషి అనగానే, సాక్షి గురించి, నన్ను బెదిరించింది అని చెప్పిన సార్ నమ్మడేమో అని అనుకుంటూ ఉంటుంది మనసులో.ఇలా మాట్లాడుతూ ఉంటే, కారు రిపేర్ చేసే అతను వచ్చి, రిపేర్ అయింది అని కీస్ తీసుకుని వస్తాడు. అప్పుడు నా పర్స్ అని చూసుకునేలోపు, సార్ నేను తీసుకొస్తాను అని లోపలికి వెళ్లి వసుధార పర్స్,ఫోన్ తీసుకొని వస్తుంది.

Guppedantha Manasu 4 August Today Episode 521 : దేవయాని కుట్రను ఇంట్లోవాళ్లు తెలుసుకోగలరా

Guppedantha Manasu 4 August Today Episode 521
Guppedantha Manasu 4 August Today Episode 521

రిషి ఫోన్ చూసుకుంటే దేవయాని చాలా మిస్స్డ్ కాల్స్ ఉండటంతో, ఫోన్ చేసి ఏంటి పెద్దమ్మ ఇన్నిసార్లు చేశారు, అనగానే, నిన్ను నేను చివరి సారి చూస్తాను. ఒకసారి రా నాన్నా అని ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ స్విచాఫ్ చేసుకుంటుంది.దాంతో రిషి వసుధార తొ మనం తొందరగా వెళ్ళాలి. వాళ్ళకు చెప్పు అర్జంటుగా వెళ్ళాలి అని అంటాడు. రిషి తొందరగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే, ఏమైంది సార్ అనగానే, మా పెద్దమ్మ ఏడుస్తూంది అని అంటాడు. దాంతో జగతికి మెసేజ్ చేస్తుంది వసుధార, ఈలోపు దేవయానిని ప్రూట్స్ తింటూ, ఒక్కొక్క సారి మన ప్లాన్ వర్కవుట్ కానప్పుడు, రివర్స్లో వెళ్లాలి అని అనుకుంటూ ఉంటుంది మనసులో.

అప్పుడు జగతి అక్కడికి వచ్చి దేవయాని తొ మీకు నా మీద కోపం ఉంటే, నామీద చూపించండి. నా కొడుకు జీవితాన్ని బలిచేయకండి. ఎందుకు సాక్షితో పెళ్లి చేయాలనుకుంటున్నారు అని అనగానే, అప్పుడు దేవయాని ఈ ఇల్లు నా ఆధీనంలో ఉండాలి. వచ్చే కోడలు కూడా నా ఆధీనంలోనే ఉండాలి, అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి, మహేంద్ర దగ్గరికి వచ్చి రిషికి ఫోన్ చెయ్ అనగానే, మహేంద్ర ఫోన్ చేస్తాడు. ఇంతలో ఇంటికి వస్తాడు రిషి. రిషి ఇంటికి రాగానే దేవయాని గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. రిషి కంగారుగా వెళ్లి ఏమైంది పెద్దమ్మ అనగానే, నిన్ను మళ్ళీ చూస్తానో లేదో అని, నన్ను క్షమించు రిషి, నేను సాక్షి విషయంలో పొరపాటు చేశాను అని, డ్రామా ప్లే చేస్తుంది.