Guppedantha Manasu 6 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 6-September-2022 ఎపిసోడ్ 548 ముందుగా మీ కోసం. రిషి వసుధారను లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్లి, ఒక ప్రదేశానికి తీసుకెళ్తాడు. రోస్ ఫ్లవర్స్ ని చేతిలో పట్టుకొని ఒక్కొక్క ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు వసుధార ని.రిషి, సాక్షి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిన రోజు తనని అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ,తన మీద వసుధారకి ఎటువంటి ఉద్దేశం ఉందో ఒక్కొక్క ప్రశ్న రూపంలో అడిగి తెలుసుకుంటున్నాడు.వసుధార అన్ని ప్రశ్నలకు తగిన సమాధానం చెబుతుంది.రిషి అడుగుతాడు నేనెందుకు ఎవ్వరికీ అర్థంకాను వసుధార, నన్నందరూ వదిలి వెళతారు అని అడుగుతాడు.
Guppedantha Manasu 6 September 2022 Episode : రిషి,వసుధార లను తన కామెడీతో ఆటపట్టిస్తున్న మహేంద్ర, గౌతమ్
అప్పుడు మీ విలువ తెలిసిన వారు ఎవరూ మిమ్మల్ని వదిలి పెట్టరు సార్ అని, వర్షం పొలాల్లో పడితే అందరూ సంతోషపడతారు, అదే మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు పడితే ఇప్పుడెందుకు పడుతుంది అని అనుకుంటాం, ఇది కూడా అంతే సార్ సాక్షికి మీరు అక్కర్లేదు, కానీ మీరు నాకు కావాలి సార్ అని అంటోంది. ఇలా ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటారు.రిషి వసుధారకు పాప్కార్న్ ఇప్పిస్తాడు. దాన్ని తింటూ, కొద్దిసేపు మళ్లీ మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధార ఇంటికి వెళుతుంది. ఒకవైపు వసుధార ఇంటి బయట జగతి మహేంద్ర గౌతమ్ ఎదురుచూస్తూ ఉంటారు వసుధార కోసం.వీళ్లకి తెలుసు వసుధార, రిషి ఒకే దగ్గర ఉన్నారు అని, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వసుధార వస్తుంది.

వసుధార రావటంతో వసుధార ని గౌతమ్ మహేంద్ర ఆటపట్టిస్తూ ఉంటారు. తన చేతుల్లో ఉన్న పాప్ కార్న్ ని తింటూ ఇది చాలా రుచిగా ఉంది అని, ఇన్ డైరెక్టుగా రిషిని కామెంట్స్ చేస్తూ ఉంటారు.ఇలా మాట్లాడుతుండగానే, రిషి,వసుధార తన కారులో బ్యాగ్ ని మర్చిపోవడంతో దాన్ని ఇవ్వడానికి వస్తాడు. రిషి ని చూసి వీళ్లు ఇంకా ఆటపట్టిస్తూ ఉంటారు.ఇలా పంచ్ ల మీద పంచ్లు వేస్తూ మహేంద్ర కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది.వీళ్లు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే వీళ్ల సంతోషాన్ని దేవయాని,సాక్షి ఎలా చెడగొడతారో,జగతి మహేంద్ర ల వెడ్డింగ్ యానివర్సరీ కూడా రాబోతుంది. దానిని కూడా, సాక్షి, దేవయాని ఎలా చెడగొడతారో రానున్న ఎపిసోడ్ లొ తెలుస్తోంది.