Rathika rose Sister : బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో భాగంగా ఎంతోమంది కంటెస్టెంట్ హౌస్ లోకి అడిగి పెట్టారు. ఈ క్రమంలోనే చాలా పాజిటివ్ గా ఎంట్రీ ఇచ్చిన రతీక రోజ్ మొదటివారం ఆట చూసి చాలామంది ఆమె కచ్చితంగా కప్పు కొడుతుంది అనుకున్నారు. కానీ తర్వాత ఆమె అసలు రూపం బయటపడింది. ఈ క్రమంలోనే ఆమెపై బయట కూడా చాలా నెగిటివ్ పెరిగింది. ఇక తన బ్రేకప్ విషయాలను బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తావించటం. అలాగే పల్లవి ప్రశాంత్ తో ఆమె ప్రవర్తించిన తీరు విధానం తర్వాత ఎలిమినేషన్ రౌండ్ లో ఒక్కసారిగా కన్నింగ్ చూపించడం జనాలుకు అస్సలు నచ్చలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ మధ్యలోనే హౌస్ నుండి బయటకు వచ్చింది. కానీ బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్ సందర్భంగా ఎవరు ఊహించిన విధంగా రెండోసారి మళ్లీ ఈ ముద్దుగుమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన మాజీ ప్రియుడు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫోటోలపై రాహుల్ కూడా స్పందించడం జరిగింది. పబ్లిసిటీ కోసం సింపతీ కోసం సెలబ్రిటీస్ ని వాడుకోవడం మంచిది కాదంటూ రాహుల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా రెండోసారి రతిక హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా రతిక చెల్లెలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ రాహుల్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ రతికా రాహుల్ ప్రేమ నిజమని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని తెలియజేసింది. ఇక ఈ విషయాన్ని మా నాన్న మరియు అక్క బావలతో కూడా రతిక చెప్పినట్లుగా తెలియజేసింది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత రతికాను ఇండస్ట్రీ వైపు వెళ్లకూడదని పెట్టడంతో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి మంచి అండర్ స్టాండింగ్ తోనే విడిపోయారంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఎవరు ఊహించని విధంగా రతిక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత వీరిద్దరి ఫోటోలు బయటికి వచ్చాయి. అవి ఎలా వచ్చాయనేది మాకు కూడా అర్థం కాలేదు. ఇక రాహుల్ సైడ్ నుండి ఈ ఫోటోలు లీక్ అయి ఉంటాయని అనుకున్నాం. ఎందుకంటే రతికా దగ్గర అలాంటి ఫోటోలులేవు. అలాగే ఓ ఆడపిల్ల తన గురించి తాను ఎప్పుడూ బ్యాడ్ గా చెప్పుకోలేదు. మళ్లీ దాని గురించి స్టోరీలో పెట్టాల్సిన అవసరం లేదు. రతికా రాహుల్ ని ఎప్పుడు యూస్ చేసుకునెందుకు ప్రయత్నించలేదు. ఇద్దరు కలిసి ఉనప్పుడే తను అలా ప్రవర్తించేది కాదు బ్రేకప్ తర్వాత ఎందుకు అలా చేస్తుందంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి రతిక చెల్లెలు చేసిన కామెంట్స్ పై రాహుల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.