Shimbu : కోలీవుడ్ స్టార్ హీరో శింబు తన జీవితంలో ఎలాంటి చేదు విషయాలను చవి చూశాడో తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న శింబు తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ తెలుగులో కూడా డబ్ చేసి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించగలిగాడు. అయితే కెరీర్ మొదట్లో శింబు స్టార్ హీరోయిన్ నయనతార తో నడిపిన వ్యవహారం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరూ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనుకున్నారు.
అతనితో కలిసి సినిమాలో నటించిన సమయంలో ఇద్దరు చేసిన రచ్చ అంత ఇంతా కాదు. వాళ్ళిద్దరూ మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకునేస్తారు ఏమో అనుకున్నారు. అంతలా రాసుకొని పూసుకొని తిరిగారు. అంతేనా లిప్ కిస్ లు పెట్టుకుంటూ బుగ్గలు రాసుకుంటూ పబ్లిక్ గా ఆ వీడియోస్ బయట పెట్టేసి బరి తెగించి ప్రవర్తించారు. అయితే ప్రైవేటుగా తీసుకున్న నయనతార శింబు లిప్ లాక్ వీడియో ఎలా సోషల్ మీడియాలోకి లీక్ అయ్యింది అనేదానిపై అప్పట్లో ఓ చర్చ జరిగింది. అయితే అందరూ కూడా శింబునే కావాలని నయనతార ఇమేజ్ ని డామేజ్ చేయాలని ఆ వీడియోని బయటపెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
Shimbu : ఆ హీరోయిన్ ఉసురు తగిలే… శింబు లైఫ్ ఇలా అయిందా…

నిజానికి ఈ వీడియో లీకైన తర్వాత నయనతార చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా ఇండస్ట్రీలో సగం పరువు పోగొట్టుకుంది. ఆ తర్వాత ఆమెకున్న టాలెంట్ తో బయటపడింది. శింబుకు మాత్రం కెరీర్ పతనం అయిపోయిందని రేంజ్ కి దిగిపోయాడు. ఈ మధ్యనే మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. దీంతో నయనతార ఉసురు తగిలి శింబు లైఫ్ అలా అయ్యింది అని కోలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. ప్రస్తుతం నయనతార తన భర్తతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. శింబు మాత్రం సినిమాలలో హీరోయిన్లతో ఎఫైర్స్ నడుపుతూ ఉంటాడని కోలీవుడ్ మీడియా చెప్పుకోస్తుంది