Zodiac Signs : జులై మాసం 2022 కుంభ రాశి వారికి గ్రహ స్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.. ఈ నెలలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. కలిసివుండి రెండో తేదీ నుండి మిధునంలోకి చేరుకుంటారు. 17వ తేదీ వరకు అక్కడే ఉండి ఆ తర్వాత బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోకి వస్తాడు. అదేవిధంగా మీనరాశిలో గురువు యొక్క సంచాలకు జరుగుతుంది.ఈ కుంభ రాశి వారికి చూసుకున్నట్లయితే విదేశాలకి వెళ్లే ప్రయత్నాలు బాగా కలిసొస్తాయి.
ఈ రాశి వారు ఎవరైతోనైన మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఈ రాశిలో ధనిష్ట శతభిషము, పూర్వాభాద్ర ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి. ధనిష్ట నక్షత్రం వారికి చిన్నచిన్న ప్రయాణాలు చేస్తారు. అలాగే ధైర్యంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అయితే కుటుంబంలో కొన్ని కలహాలకు దారి తీస్తాయి. కొంచెం జాగ్రత్తలు వహించాలి. శతభిషా నక్షత్రం వారికి జర్నీస్ చేస్తుంటారు. కొంచెం విద్య విషయంలో ఒత్తిడిలు కనిపిస్తున్నాయి. పూర్వాభాద్ర నక్షత్రం వారికి వ్యాపారం మూలంగా ధన లాభాలు బాగా కలిసొస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.
Zodiac Signs : కుంభ రాశి వారికి జులై నెల రాశి ఫలాలు

గతంతో చూసుకున్నట్లయితే ఈ మాసంలో మంచి అనుకూలతను పొందుతారు. ఈ కుంభ రాశి వారికి చూసినట్లయితే కొన్ని భూములు కానీ గృహాలు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేందుకు కొంతవరకు అనుకూలత కనిపిస్తుంది. అయితే కొన్ని గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే కొన్ని శుభకార్యాలకు హాజరవుతారు అలాగే కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు అలాగే డబ్బులు విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అన్ని రకాల వృత్తుల వారికి మంచి అనుకూలత కనిపిస్తుంది. అలాగే సమాజంలో మంచి పేరు ప్రాక్యతలు లభిస్తాయి. ఈ రాశి వారికి అన్నిట్లో మంచి అనుకూలత పొందడం కోసం. ఈ కుంభ రాశి వారు చేయవలసిన దేవతారాధన: విష్ణు సహస్రనామాలు శివుని చూస్తూ చదవండి. అలాగే శని, కుజ, రవి గ్రహాల దగ్గర దీపరాధన చేయండి. ఎలా చేయడం వలన అన్ని మంచి ఫలితాలను పొందుతారు.