Hyper Aadhi : బుల్లితెరపై మల్లెమాల షోలకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. మల్లెమాల చేసే కార్యక్రమాలన్నీ హిట్ అవుతూనే ఉంటాయి. ఈటీవీలో మల్లెమాలకు ప్రత్యేక స్థానం ఉంది. 20 ఏళ్ల ఈటీవీ జర్నీలో మల్లెమాల కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి మల్లెమాల ఈమధ్య కొన్ని షోలు కొన్ని ఈవెంట్లలో దారుణంగా ప్రవర్తిస్తుంది. కొన్నిసార్లు హద్దులు దాటుతున్నట్లు అనిపిస్తుంది. ప్రతి పండుగకు ఓ స్పెషల్ ఈవెంట్ చేస్తుంటుంది మల్లెమాల టీం. అలా వినాయక చవితికి కూడా ఓ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ప్రస్తుతం మల్లెమాల వరుస కార్యక్రమాలను చేస్తుంది. డి, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇలా అన్ని షోలను ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది. మల్లెమాల బడ్జెట్ ను జబర్దస్త్ షో భారీగా పెంచేసింది. అలా ఇప్పుడు మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ గా మారింది.
మల్లెమాల ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలను ఇంట్రడ్యూస్ చేస్తుంది. జాతి రత్నాలు అనే స్టాండ్ కామెడీ షో ని కూడా మొదలు పెట్టేసింది. ఇక పండుగలకు చేసే ప్రత్యేక ఈవెంట్లు అందులోని కొత్త కొత్త కాన్సెప్ట్లు అందరిని ఆకట్టుకుంటాయి. సంక్రాంతి, దసరా, దీపావళి ఇలా అన్ని పండగలకు ప్రత్యేక ఈవెంట్లు చేస్తుంటుంది. అందరిని ఎంటర్టైన్ చేసేందుకు ఎప్పుడు ముందుంటుంది. ఈసారి వినాయక చవితికి మన ఊరి దేవుడు అనే ఈవెంట్ను చేయబోతుంది మల్లెమాల. ఇందులో నాగినీడు వచ్చాడు. ఆయనతో పాటుగా కుష్బూ వచ్చింది. ఇంకా మరోసారి కృష్ణ భగవాన్ శ్రీదేవి డ్రామా కంపెనీలోకి రావడం, ఆయన తన పంచులతో అదరగొట్టేయడం, ఇలా మరోసారి వినాయక చవితికి ఈవెంట్ లోకి తీసుకొచ్చారు. ఈవెంట్లో జబర్దస్త్ ఆర్టిస్టులంతా కూడా రకరకాల టాస్కులు చేస్తున్నట్టు కనిపిస్తుంది.
Hyper Aadhi : వర్ష, ఇమాన్యుయేల్ పై హైపర్ ఆది ఎటాక్…
బురదలో దొరలడం, బురదలో కబడ్డీ ఆడటం, బురద మొహానికి పట్టించడం వంటివి చేస్తూ నానా హంగామా చేశారు. గెటప్ శ్రీను, బుల్లెట్ భాస్కర్, ఆదిలను బురదలో తొక్కేసి కప్పేసినట్లు కనిపిస్తుంది. ఇంకో చోట వర్ష, ఇమాన్యుయేల్ ప్రేమకు హైపర్ ఆది పరీక్షలు పెట్టినట్టు, వారిద్దరి చేతులు మీద నుంచి కార్లను పోనిచ్చారు. ముందు వర్ష ఆ టాస్కులు చేయనన్నది. కానీ చివరకు ఎలాగోలా చేసింది. ఆ తర్వాత వర్ష, ఇమాన్యుయల్ ట్యూబ్లైట్లతో కొట్టాడు. వర్ష కూడా ఆదిని కొట్టేసింది. ఈ ప్రోమో లో ఇదే హైలెట్ చేశారు. వారికి ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టు చూపించారు. ఇది చూసిన జనాలు విరుచుకుపడుతున్నారు. ఇలాంటివి ఎన్ని చూడలేదు, ఇకనైనా ఆపేయండి అంటూ మల్లెమాల మీద జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ ఈవెంట్ అని చెప్పు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారా అంటూ మండి పడుతున్నారు. ఎంతసేపు ఈ పిచ్చి ట్రాక్లు, పిచ్చి కామెడీ లేనా అంటూ కోపం వ్యక్తం చేస్తున్నారు.