Hyper aadi : ఈటీవీలో మల్లెమాల ప్రతి పండగకి కచ్చితంగా ఈవెంట్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే త్వరలో దసరా రాబోతున్న సందర్భంగా దసరాకి ప్రత్యేక ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ ప్రోమోలో హైపర్ ఆది ఎప్పటిలాగానే తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించాడు. అదే మాదిరిగా ఎప్పుడు చేసినట్లుగానే ఇతరులపై అవమానకరమైన పంచులు వేస్తూ అవతల వారిని ఇబ్బంది పెడుతుంటాడు. అయితే ఇలా పంచ్ వేయబోతున్నట్లుగా ముందే హైపర్ ఆది వాళ్లకు చెబుతాడట. అయినా కూడా వారు ఆ సమయంలో ఇబ్బంది పడ్డట్లుగా అనిపిస్తుంది.
అయితే తాజాగా సిరి హనుమంతు పై హైపర్ ఆది తనదైన స్టైల్ లో కామెడీ పంచ్ వేశాడు. సిరి పై పంచ్ వేస్తూ ఇలా అన్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఒక షన్ను కి మాత్రమే నువ్వు ఫన్ ఇచ్చావు కానీ ప్రేక్షకులకు ఇవ్వలేదు అన్నట్లుగా హైపర్ ఆది కామెంట్ చేశాడు. అప్పుడు సిరి కాస్త ఇబ్బంది పడినట్లుగానే అనిపించింది. బిగ్ బాస్ లో ఉన్నపుడు సిరి మరియు షన్ను బాగా దగ్గరయ్యారు. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకున్నారు. కేవలం ఆ రిలేషన్ వలన షన్నుకి బిగ్ బాస్ ట్రోఫీ దక్కలేదు అనడంలో సందేహం లేదు. బయటికి వచ్చిన తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ఇద్దరు కూడా అసలు కలిసిందే లేదు.
Hyper aadi : సిరి పై పంచ్ వేసిన హైపర్ ఆది…

బిగ్ బాస్ హౌస్ లో వారిద్దరికీ కేవలం రేటింగ్ కోసమే అలా నటించారు అనేది చాలామంది ఇప్పటికి అనుకుంటున్నారు. గడిచిపోయిన కాలాన్ని కొనిచేదు సంఘటన మళ్లీ గుర్తు చేసుకుంటే మంచిది కాదు ఇప్పుడు సిరీతో ఆ విషయం మాట్లాడితే అమ్మ కచ్చితంగా ఫీల్ అవుతుంది. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు అయినా కూడా హైపర్ ఆది ఏమాత్రం మొహమాటం లేకుండా తనపై పంచులు వేస్తూ కామెడీ పేరుతో అవతల వారిని విమర్శిస్తు ఉన్నాడు. ఇది ఆయన తీసుకొచ్చిన కొత్త రకం కామెడీ దీనిని చాలా మంది తప్పు కొడుతున్నారు అయినా కూడా తనదైన స్టైల్ లో ముందుకు సాగుతున్నాడు